మోహన్ బాబు టాక్ షోల్లో.. ఇంటర్వ్యూల్లో అరుదుగా కనిపిస్తుంటారు. కారణం ఆయనకు కోపం ఎక్కువని ఒక విమర్శ ఉంది. అయితే ఆయనకు కోపం ఊరికే రాదు అని ఈ సంఘటన తో అర్థమవుతుంది. మోహన్ బాబును ను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ప్రశ్న అడిగి హర్ట్ చేశాడు. దాంతో మోహన్ బాబు ఇచ్చిన రివర్స్ ఆన్సర్ కి సదురు యాంకర్ కి దిమ్మతిరిగింది. ఫ్రాంక్లీ విత్ టి యన్ ఆర్ షో కి మోహన్ బాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో టీఎన్నార్ మోహన్ బాబును మీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సర్ అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మోహన్ బాబు నవ్వుతూనే టి యన్ ఆర్ కు షాకిచ్చారు. ఎలాంటి ప్రశ్నలు అడగాలో మీకు తెలియదా అంటూ మోహన్ బాబు అడిగిన ప్రశ్నకు టి యన్ ఆర్ నోట మాట రాలేదు.

ప్రశ్నకు మోహన్ బాబు సమాధానం చెబుతూ.. గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవారేమో.. పెళ్లి అయిన తర్వాత మాత్రం ఏక పత్నీవ్రతుడిని అని చెప్పారు. మీరు ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని కాకుండా పర్సనల్ గా వెళ్లారు. ఇదే ప్రశ్న నేను మిమ్ములను అడుగుతున్నాను. మీరు చదువుకునేప్పుడు ప్రేమించలేదా! మీరేమైనా సత్యశీలులా మీకు ప్రేమలు ఉండవా...? అంటు రివర్స్ లో పంచ్ వేశారు. నేను గనక ఇలానే మిమ్మలిని ఇంటర్వ్యూ చేస్తే దిమ్మ తిరిగి మళ్లీ మీ ఆవిడ ఇంట్లోకి రాకుండా చేస్తుంది. మీరు ఆ తర్వాత భోజనం కూడా చేయలేరు.. అలా నేను కూడా మిమ్ములను ప్రశ్నలు వేయగలను. మీరు మమ్ములను ప్రశ్నిస్తారు కాని మేము మిమ్ములను ప్రశ్నించకూడదా.. మీరేమైన దేవుళ్లా అంటూ నవ్వుతూనే తన స్టైల్లో టి యన్ ఆర్ ని ఏకిపారేశారు.

పదే పదే ఒక విషయాన్ని అడిగి ఏదైనా సంచలనం దొరికితే టీవీల్లో రోజుకు 20 సార్లు వేద్దాం అనుకుంటున్నారు. ఈ వయసులో నేను విద్యాలయాల అధినేతగా ఉన్నాను. వాటికి సంబంధించిన ప్రశ్నలు లేదంటే మరో ముఖ్యమైన విషయాల గురించి ప్రశ్నించాలంటూ యాంకర్ టి.యన్.ఆర్ కు సున్నితంగా మోహన్ బాబు హెచ్చరిక చేశాడు. ఈ హెచ్చరిక ఒక్క టి.యన్.ఆర్ కే కాదు ఇక మీదట సెలబ్ట్రీస్ ని ఎవర్ని ఇంటర్యూ చేయాలన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటర్యూ చేయాలని మోహన్ బాబు సమాధానం చూస్తే అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: