మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన భారీ డిజాస్టర్ 'అజ్ఞాతవాసి'. సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళడం తో పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయారు. అయితే గత ఎన్నికల సమయంలో పవన్ ఇక మీదట సినిమాలు చేయను. పూర్తిగా  ప్రజా సేవకే అంకితం అంటు స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో అందరు ఇక పవన్ సినిమాలు వదిలేశాడని అనుకున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దిల్ రాజు కలిసి మళ్ళీ పవన్‌ తో సినిమాను మొదలు పెట్టించ బోతున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ పింక్ సినిమా రీ మేక్ లో పవన్ నటించబోతున్నాడు. 

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా 'పింక్' సినిమాను ముందుగా తమిళ నటుడు అజిత్‌తో కోలీవుడ్ లో 'నేర్కొండ పార్వాయ్' టైటిల్‌తో రీమేక్ చేశారు బోనీ కపూర్. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ని అందుకుంది. దాంతో ఈ సినిమాని తెలుగులో తీసినా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ తో నిర్మించబోతున్నారు.  ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడని కూడా ఇప్పటికే అఫీషియల్ గా కన్ఫాం చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ 'పింక్' రీమేక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని తాజా సమాచారం. ఇక ఈ సినిమాకి పవన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ ఈ సినిమాకు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు వచ్చిన లాభాల్లో 25% వాటా తీసుకుంటారని లేటెస్ట్ న్యూస్. అంతేకాదు పవన్ ను సంప్రదిస్తున్న ఇతర నిర్మాతలకు కూడా పవన్ తరపువారు సేమ్ రెమ్యూనరేషన్ డీల్ చెప్తున్నారని ఫిల్మ్ నగర్ లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ డీల్ ప్రకారం పవన్ రెమ్యూనరేషన్ మొత్తంగా రూ. 50 కోట్లు దాటొచ్చునని అంచనా వేస్తున్నారు.

టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ మహేష్ బాబు మాత్రమే అన్న విషయం తెలిసిందే. మహేష్ సొంత బ్యానర్ స్థాపించినప్పటినుంచి ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. ప్రభాస్ కి కూడా ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి పవన్ రెమ్యూనరేషన్ ను బట్టి ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. మరి రీఎంట్రీ లో పవన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు ఏ.ఎం.రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకుడిగా కూడా పవన్ ఒక సినిమాని కమిటయ్యాడని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: