‘బిగ్ బాస్’.. ఈ మ‌ధ్య కాలంలో ఈ  షో పేరు వింటుంటేనే ప్ర‌తి మ‌నిషిలో ఒక ర‌క‌మైన వైబ్రేష‌న్ క్రేజ్ అనేది క‌నిపిస్తుంది. ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా కూడా ఈ షోకి వ‌చ్చినంత క్రేజ్ మ‌రే షోకి రాలేదంటే అతిశ‌యోక్తి లేదు.  మొద‌ట్లో కాస్త ఈ షోకి వివాదాలు ఉన్నా రానురాను దీనికి అంత‌కంత‌కూ ప్రేక్ష‌కాద‌ర‌ణ పెరిగుతూనే వ‌చ్చింది.  మొద‌ట్లో ఈ షో బాలీవుడ్‌లో మొద‌లైంది. త‌ర్వాత చిన్న తెలుగులో కూడా ప్రారంభించారు.  ఇక‌పోతే ఈ రియాలిటీ షో నిధానంగా అన్ఇన భాష‌ల్లో ఫేమ‌స్ అయిపోయింది.  ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జూలై 17 2017లో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ మొదలవగా.. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోయింది. ఆ తర్వాత నాని హోస్ట్‌గా సాగిన రెండో సీజన్ కూడా మంచి వ్యూస్ రాబట్టుకుంది. 


ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన మూడో సీజన్ తాజాగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు, ట్విస్టులతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా రాహుల్ అండ్ పునర్నవి లవ్ ఎపిసోడ్స్ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా అలరించాయని చెప్పొచ్చు. ఇకపోతే రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈ విష‌యంలో చాలా మంది ప్రేక్ష‌కులు శ్రీ‌ముఖి టైటిల్ విన్న‌ర్ అవుతుంద‌ని భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా రాహుల్ విన్ అయ్యారు. ఈ విష‌యంలో శ్రీ‌ముఖి చాలానే అప్‌సెట్ అయిన‌ట్లు ఆ రోజు స్టేజ్ పైనే ఆమె ముఖ‌క‌వ‌ళింపుల‌ను బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు. 


ఇకపోతే ఇప్పటివరకు జరిగిన ఈ షోలో వీళ్ళ‌కు పారితోషికాలు మాత్రం భారీగానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ముగ్గురు మాత్రం ఎక్కువ పారితోషికం అందుకున్న‌ట్లు స‌మాచారం. వాళ్ళ‌లో ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకున్న‌ది మొద‌టి సీజ‌న్‌లో స‌మీర్ వారానికి 10 ల‌క్ష‌లు చ‌ప్పున అందుకోగా తిర‌గి సీజ‌న్ 3లో ఎంట్రీ ఇచ్చిన న‌టి హేమ 9.7 ల‌క్ష‌లు. వీరితో పాటు హౌస్‌లో ఉన్న యాంక‌ర్ శ్రీ‌ముఖి 100 రోజుల‌కు మూడు కోట్లు అందుకున్నట్లు ఇక వ‌రుణ్‌తేజ్ కోటిరూపాయ‌లు తీసుకున్న‌ట్లు స‌మాచారం. 
మొత్తానికి టైటిల్ విన్న‌ర్‌క‌న్నా ఎక్కువ శాతం పారితోషికం శ్రీ‌ముఖి అందుకున్న‌ట్లు తెలుస్తోంది. వ‌రుణ్‌తేజ్ లాంటి హీరో, రాహుల్ సింగ‌ర్ వీళ్ళంద‌రి టాలెంట్‌ని ప‌క్క‌కు పెట్టి గ్లామ‌ర్‌కి ఎక్కువ ప్రాధాన్య‌త నిస్తూ శ్రీ‌ముఖికి ఇంత పారితోషికం చెల్లించారా లేక శ్రీ‌ముఖి డిమాండ్ అలా ఉందా అన్న‌ది కొంద‌రికి సందేహంగా మిగిలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: