38 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపటితో అనుష్క 39 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఇంత పెద్ద వయసు వచ్చే సరికి సాధారణంగా హీరోలకు తప్ప హీరోయిన్స్ కు క్రేజ్ ఉండదు. ఇలాంటి పరిస్థితులలో రేపు జరగబోతున్న అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి టాప్ హీరోల అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. 

సౌత్ మరియు నార్త్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుష్క ‘భాగమతి’ మూవీ తరువాత మరే సినిమా చేయలేదు. త్వరలో ‘నిశబ్దం’ విడుదల కాబోతున్నా ఇంకా ఆ మూవీ ఎప్పుడు విడుదల కాబోతుంది అన్న క్లారిటీ లేదు. 

ఆమెకు అనేక అవకాశాలు వస్తున్నా అనుష్క సినిమాలను చేసే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.  అయితే సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ మద్య కాలంలో స్టార్ హీరోల బర్త్ డేల సందర్బంగా కామన్ డీపీ అంటూ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారు. స్టార్ హీరోలకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. 

కాని రేపు బర్త్ డే జరుపుకోబోతున్న అనుష్కకు కూడా ఫ్యాన్స్ కామన్ డీపీ క్రియేట్ చేయడంతో పాటు హ్యాపీబర్త్ డే అనుష్క అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. అనుష్కతో సమానంగా క్రేజ్ ఉన్న నయనతార వరస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకు పోతుంటే అనుష్క మాత్రం తన సినిమాలను తగ్గించుకుని ఎందుకు ఇలా చాలా మందిని తప్పించుకుని తిరుగుతోంది అంటూ ఆమె అభిమానులు  మధన పడిపోతున్నారు. ఈ పుట్టినరోజు తరువాత అయినా అనుష్క తన తీరు మార్చుకుని ఎక్కువ సినిమాలు చేయాలని అభిమానులు కోరిక..


మరింత సమాచారం తెలుసుకోండి: