తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి అయినా స్వరా భాస్కర్‌ 'సన్ అఫ్ అభిష్‌' అనే చాట్ షో లో పాల్గొన్నారు. అయితే ఈ కామెడీ చిట్ చాట్ షో లో స్వరా భాస్కర్ తన సినీ కెరీర్ ఆరంభ విషయాలను గుర్తుచేసుకుంటూ తాను చేసిన ఓ ప్రకటన గురించి చెప్పుకొచ్చారు. ఆ యాడ్ లో తనతో కలిసి నటించిన ఓ 4 ఏళ్ళ కుర్రాడు తనని ఆంటీ అన్నాడంటూ.. ఏ సిగ్గు శరం లేకుండా చిన్న పిలాడు అని కూడా ఆలోచించకుండా నానా బూతులు తిట్టింది.

ఆ సోప్ యాడ్ షూట్ లో నన్ను ఆంటీ అని పిలిచినందుకు చాలా నిరాశకు గురయ్యానని బాధపడ్డానని చెప్పారు. అసలు పిల్లలంటేనే దెయ్యాలని చెప్పారు.  ఇక దీనికి సంబందించిన వీడియో రెప్పపాటులో వైరల్ అవ్వడం దీన్ని చూసి నెటిజన్ల షాక్ అవ్వడం తర్వాత ఆమె పై చైల్డ్ అబ్యూస్ కేసు నమోదు కావడం అన్ని చక చక జరిగిపోయాయి. 


ఏమి తెలియని 4 ఏళ్ళ పిల్లాడిని ఇంగిత జ్ఞానం లేకుండా తిడతావా అంటూ నెటిజన్ల ఆమె పై మండిపడుతున్నారు. ఆమెకు సంబందించిన "#Swara_aunty" హాష్ ట్యాగ్ మంగళవారం పొద్దున్న నుంచి ట్రెండ్ అవుతుంది. గతంలో పిల్లలని వేదించవద్దు అంటూ ప్లకార్డులు పట్టుకొని తిరిగిన ఈమెకు పిల్లల పట్ల ఎంత గౌరవం ఉందో ఇపుడు అర్ధమవుతుందంటూ కొందరు అంటున్నారు. 


ఓ ఆంగ్ల వెబ్ సైట్ ప్రకారం.. ఒక ఎన్జీవో -- లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే సంస్థ.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ కి పిర్యాదు చేసి ఆమెపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. వీరే ది వెడ్డింగ్ సినిమాలో నటించిన ఈ భామ కి విమర్శలును ఎదుర్కోవడం కొత్తెమికాదు. ఓ సారి రెడ్ కార్పెట్ పై తన కాలి చెప్పూ తీస్తూ కోపంగా ఉన్న ఆమె ఫోటో బయటకు రావడంతో ట్రోలింగ్ కి గురైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: