తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 మొన్న ఆదివారం ఎంతో గ్రాండ్ గా ముగిసింది.  సినీతారల సందడితో నాగ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.  చివరిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఈ షోకి ఫైనల్ టచ్చింగ్ ఇచ్చారు.  అయితే 100 రోజుకు పైగా సాగిన బిగ్ బాస్ 3 షో లో రాహుల్, శ్రీముఖి ఫైనల్ గా నిలిచారు.  ఇద్దరిని స్టేజి పైకి పిలిచి నాగార్జున..రాహూల్ చేయి పైకి లేపడంతో బిగ్ బాస్ 3 విన్నర్ గా అనౌన్స్ చేశారు.  మొన్నటి వరకు రాహూల్ సిప్లిగంజ్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలిసేది కాదు..బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ హైదరాబాద్ కుర్రోడు ఎవరో తెలిసిపోయింది. 

అయితే రాహుల్ ఈ స్థాయికి రావడం వెనుక అతను పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఒకదశలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు..కానీ రెండు రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు.  అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా టాస్క్, గేమ్స్ ఆడుతూ తనను తాను ప్రూవ్ చేసుకొని విన్నర్ గా గెలిచాడు. ఫినాలే వీక్ లో దాదాపు 9 కోట్ల ఓట్లు పోల్ అయితే అందులో దాదాపు 45 శాతం ఓట్లు ఒక్క రాహుల్ కే పడ్డాయి. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యాడు రాహుల్ సిప్లిగంజ్. 


రాహూల్ కి ఇండస్ట్రీ బ్యాగ్ గ్రౌండ్ ఏమీలేదు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ లోని ధూల్ పేట్ లో జన్మించాడు రాహుల్ సిప్లిగంజ్. తన బాల్యం, చదువు అంతా హైదరాబాద్ లోనే సాగింది. లయోలా హై స్కూల్ లో పది తరగతి పూర్తి చేసిన రాహుల్ తర్వాత నారాయణ జూనియర్ కాలేజీ నుండి ఇంటర్ చదివాడు.  చిన్ననాటి నుంచి సంగీతం పై ఎక్కువ మోజు చూపిస్తున్న రాహూల్ ని చూసి ఆయన తండ్రి మ్యూజిక్ స్కూల్ లో చేర్పించాడు. మొదటగా రాహుల్ కు స్నేహితుడా సినిమాలో పాడే అవకాశం వచ్చింది. కాకపోతే జోష్ మూవీ మొదట విడుదలవడంతో అందులోని కాలేజీ బుల్లోడా పాట తన మొదటి పాట అయింది.


స్నేహితుడా, జోష్ లో పాడిన రాహుల్ యూనిక్ వాయిస్ చూసి అబ్బురపడ్డ కీరవాణి తన  కోరస్ టీమ్ లో జాయిన్ చేసుకున్నారు.  కీరవాణి దగ్గరే కోరస్ సింగర్ గా చేస్తూ దమ్ము, ఈగ, షిరిడీ సాయి వంటి సినిమాల్లో పాటలు పాడాడు.  ఇటీవల సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన  రంగస్థలంలో టైటిల్ సాంగ్, చిత్రలహరి మూవీలో గ్లాస్ మేట్స్ అంటూ సాగే సాంగ్, ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ లో బోనాలు సాంగ్ ఇవన్నీ రాహుల్ కెరీర్ కు ఊపునిచ్చాయి. ఇక రాహూల్ మొదటి నుంచి మాస్ సాంగ్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేశారు.

ఇక మగజాతి, మాకి కిరికిరి, దావత్, మంగమ్మ, గల్లీ గా గణేష్ వంటి సాంగ్స్ కు మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. మూడు నెలల క్రితం విడుదలైన హిజ్రా సాంగ్ కు అప్పుడే 3.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేత చాటుతున్న రాహూల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ నుంచి పిలుపురావడం..పదహారు మంది ఇంటిసభ్యుల్లో తను ఒకరిగా ఎంట్రీ ఇచ్చి..ఆడి..పాడీ..గెలిచి..మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ గా కప్పు గెల్చుకున్నాడు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: