మోహన్ బాబు ఓపెన్ గా మాట్లాడితే చాలు ఏదో ఒక సంచలనం ఉంటుంది. అలాంటిఈ విలక్షణ నటుడిని ఒక టాక్ షోలో ఇంటర్వ్యూ   చేయాలి అంటే ఆ కార్యక్రమం నిర్వహించే వ్యక్తికి చాల దమ్ము ఉండాలి. 

అడిగిన ప్రశ్న నచ్చకపోతే మోహన్ బాబు మండిపడిపోవడమే కాకుండా ఆ ప్రశ్న అడిగిన యాంకర్ కు రివర్స్ క్లాస్ పీకుతాడు. మోహన్ బాబు కు ఈమధ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నుండి ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ‘ప్రాంక్లీ విత్ టి యన్ ఆర్’ షో కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.

ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మోహన్ బాబును మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మోహన్ బాబు నవ్వుతూనే ‘టి యన్ ఆర్’ కు చురకలు అంటించాడు. ఎలాంటి ప్రశ్నలు అడగాలో మీకు తెలియదా అంటూ కాస్త అసహనం కూడా వ్యక్తపరిచాడు. తనకు గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవారేమో కానీ పెళ్లి అయిన తర్వాత మాత్రం తాను ఏక పత్నీవ్రతుడిని అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

అంతేకాదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వల్ల ప్రయోజనం ఏమిటి అంటూ ఏదైనా ఒక ముఖ్య సమస్య పై తన అభిప్రాయం అడిగితే బాగుంటుంది కానీ ఇలాంటి తుంటరి ప్రశ్నలు వల్ల ఛానల్స్ కు రేటింగ్స్ వస్తాయి కానీ జనానికి ఏమి ప్రయోజనం అంటూ రివర్స్ క్లాస్ పీకాడు. దీనితో మోహన్ బాబుతో ఎందుకు పెట్టుకున్నానా అని ఆ యాంకర్ తల పట్టుకున్నాడు. అందుకే మోహన్ బాబుకు కథలు చెప్పడానికే కాదు అతడికి పాత్రలు ఇవ్వడానికి కూడ చాలామంది భయపడిపోతు ఉన్న పరిస్థితులలో ఇంత గొప్ప నటుడుకి కూడా ప్రస్తుతం ఎటువంటి అవకాశాలు రావడంలేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: