ఈ మద్య సినీ తారలు ఎక్కువగా ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతున్నారు.  గ్లామర్ షో చేసే హీరోయిన్లు సైతం మంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలవైపే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన‘హార్ట్ ఎటాక్ ’మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన నటి అదా శర్మ తాజాగా  విద్యుత్ జమ్వాల్ హీరోగా   తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘కమాండో 3’లో నటిస్తుంది. ఇప్పటికే కమాండో సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి సక్సెస్ అవగా, వాటిని మించేలా దర్శకుడు ఆదిత్యదత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 


అదా శర్మ స్వతగాహాగా జమ్నాస్టిక్,యోగా లో మంచి ప్రావిణ్యం ఉన్న నటి.  తాజాగా ‘కమాండో 3 ’ యాక్షన్ మూవీ కావడంతో ఈ అమ్మడు కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటించింది.  ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న అదాశర్మ కొన్ని సీన్లలో తన ఫైటింగ్ స్కిల్స్ తో మెప్పించిందట. మరోనటి భావన రెడ్డి సైతం పోలీస్ పాత్రలో దుమ్మురేపింది. ఇటీవల కమాండో 3 కి సంబంధించిన ఓ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో విద్యుత్ జమ్వాల్ తన మార్షల్ ఆర్ట్స్ తో కిర్రెక్కించగా..ఇద్దరు హీరోయన్లు సైతం యాక్షన్ సీన్లలో కుమ్మేశారు.


ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అదాశర్మ తాజాగా తన క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడి నేర్చుకున్న భారతీయ మార్షల్ ఆర్ట్స్ విద్య సిలంబం తాలూకు వీడియోను ఆదా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. ‘తమకు సెక్యూరిటీగా దేశి బాడీగార్డ్ కావలసిన వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే ఈనెల 29వ తేదీన కమెండో 3 రిలీజ్ తరువాత భావనా రెడ్డి ఫుల్ బిజీ’ అంటూ ఆమె సరదాగా ఈ పోస్ట్ చేయడం జరిగింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: