చాలా కొద్ది రోజులలోనే బుల్లి తెర స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు ప్రదీప్. అటు ఈటీవీ లో వచ్చే డాన్స్ కార్యక్రమాలలోనూ ఇటు అవార్డు ఫంక్షన్స్ లోనూ తనదైన శైలిలో వ్యాఖ్యాత గా దుమ్మురేపిన ప్రదీప్ గత కొన్ని వారాలుగా కనిపించడం లేదు. ఇప్పటి వరకు సరైన కారణమూ తెలియలేదు. తనకి డెంగ్యూ వచ్చిందని త్వరలోనే మళ్ళీ బుల్లి తెరపై కనిపిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త వచ్చి చాలా రోజులవుతున్నా ఇంతవరకు కనిపించని ప్రదీప్ పరిస్థితి గురించి పలు రకాల అనుమానాలు తెరలేస్తున్నాయి.

 

 

యాంకర్ రవి కూడా ప్రదీప్ కి ఏమవ్వలేదని త్వరలోనే ఆయన వస్తాడని సామజిక మాధ్యమాలలో చెప్పాడు. రవి చెప్పినట్లే ప్రదీప్ వస్తాడని ఎదురుచూసినా అభిమానులు తను ఇంకా రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఓ ప్రముఖ వెబ్ సైట్ ప్రకారం.. ప్రదీప్ ఒక సినిమా లో హీరో గా చేస్తున్నాడని.. షూటింగ్ చేసే సమయంలో తన కాలికి గాయమైందని.. వైద్యులు తనని కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోమన్నారని.. అందుకే అతను బుల్లి తెరపైకి రావట్లేదని చెప్పుకొచ్చింది. కానీ ఎపుడూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ప్రదీప్ తన పరిస్థితి గురించి ఏ సమాచారం ఇవ్వకపోవడంతో వివిధ రకాల ఊహాగానాలు చేసుకుంటున్నారు ప్రదీప్ అభిమానులు. 

 
ప్రదీప్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కనీసం సోషల్ మీడియా లో తన ఆరోగ్యం ఇంకా తను కనిపించక పోవడానికి గల కారణం గురించి ఒక చిన్న పోస్ట్ అయినా ప్రదీప్ పెట్టకపోవడంతో ఈ అమ్మాయిలంతా తెగ ఆందోళన పడుతున్నారు. ఏదేమైనా స్వయంగా ప్రదీప్ తన ప్రస్తుత పరిస్థితి గురించి చెప్తేనే నమ్ముతాం అంటున్నారు అతని ప్రియ అభిమానులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: