కోలీవుడ్‌ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఖైదీ.లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పదేళ్ల తరువాత విడుదలైన ఓ ఖైదీ తన కూతురిని తొలిసారిగా చూసేందుకు చేసే ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు కంటతడి పెట్టించే ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు.


విజయ్‌ హీరోగా తెరకెక్కిన బిగిల్‌కు పోటిగా రిలీజ్‌ అయిన ఖైదీ హిట్ టాక్‌ సొంతం చేసుకోవటమే కాక కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతోంది. రిలీజ్‌అయ్యి రెండు వారాలు అవుతున్నా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లో కార్తి కెరీర్‌ బెస్ట్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా వసూళ్ల సాధించినట్టుగా చిత్రయూనిట్ తెలిపింది.కార్తి గత చిత్రాలు ఆశించిన స్థాయిల సక్సెస్‌ కాకపోవటంతో ఖైదీపై పెద్దగా అంచనాలు లేవు.


దీంతో తొలి రోజు ఈ సినిమా భారీ వసూళ్లేమీ దక్కలేదు. తొలిరోజు 3.5 కోట్లు వసూళ్లు చేసిన ఖైదీ రెండో 2.8 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ మూడో రోజు నుంచి వసూళ్లు భారీగా పెరిగాయి. మూడో రోజు 4.7 కోట్లు సాధించిన ఈ సినిమా తొలి వారాంతానికి కేవలం తమిళనాడులోనే 11 షేర్‌, 25 కోట్ల గ్రాస్‌ సాధించింది.తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఖైదీ తొలి పది రోజుల్లో 70 కోట్లకు పైగా గ్రాస్‌ మార్కుని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్ల మార్క్‌ను దాటినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఈ వారాంతానికి 100 కోట్ల మార్క్‌ను కూడా ఈజీగా అందుకోవటం ఖచ్చితం అనిపిస్తుంది.  


2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమా కూడా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది .అదే దారిలో ఈ సినిమా కూడా దుమ్ము లేపుతుంది. ఖైదీకి పోటిగా రిలీజ్‌ అయిన విజయ్‌ బిగిల్‌ ఇప్పటికే వసూళ్లు విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: