ఒక పోలీస్ గా, నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, ఫ్యాక్షనిస్ట్ గా కనిపించిన అప్పుడప్పుడు  ప్రయోగాలు చేస్తూ పాండురంగడు, ఒక్క మగాడు మరియు ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలు  చేయడం తప్పిస్తే ఎప్పుడూ మాస్ సినిమాల వైపు అడుగేస్తుంటాడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలయ్య బాబు ఇప్పుడుసరికొత్తగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక క్యారెక్టర్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కే యస్ రవికుమార్ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ఇది దీనికి రూలర్ అనే పేరుని నామకరణం చేసారు. చిత్రం పేరు చూస్తే మళ్ళి ఏదో యాక్షన్ థ్రిల్లర్ మరియు ఫ్యాక్షన్ కి సంబందించిన ఇటీవల వచ్చిన లెజెండ్  సినిమా  తరహా లాగే ఉంటుంది అని అనుకున్నారు  కానీ అది ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం  చేస్తున్న వ్యక్తి పాత్ర  గా మరియు పోలీస్ పాత్రలో  కూడా నటిస్తున్నట్లు అతడు విడుదల చేసిన దృశ్యాలు  మరియు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది అలాగే ఈ దృశ్యాలు చూసిన   తరువాత  సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ చిత్రంలో  నటిస్తున్న రెండు భిన్నమైన పాత్రల్లో అతడు ఎలా మెప్పిస్తాడు అని అభిమానులు వేచిచూస్తున్నారు.  ఆ మధ్య విడుదలైన స్టైలిష్ లుక్ కూడా దీనికి సంబంధించిందే బాలయ్య ఫ్రెంచ్ గడ్డం తో స్టైలిష్ గా కనిపించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గా మరియు   పోలీస్ పాత్రల్లో  కనిపించనున్నారు. అయితే ప్రేక్షకులు మరియు నెటిజనులు బాలయ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించడం ఏంటి ఎప్పటి వరకు ఎవరు పెద్ద హీరోలు చేయని ప్రయోగం చేస్తున్నారని ప్రయోగాలు చేసిన ప్రతి సరి అయన ఫెయిల్ అయ్యారని వాపోయారు.

అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో ఎక్కువగా కుర్ర హీరోలు కనిపిస్తుంటారు కానీ సీనియర్ హీరోలను ఊహించుకోవడం కష్టమే. మరి ఇప్పుడు 60ఏళ్లలో   ఉన్న బాలయ్యను సాఫ్ట్ వేర్‌లో ఎలా చూపించబోతున్నారో దర్శకులు ప్రేక్షకులు మరియు అభిమానులు   ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈయనే కాదు సీనియర్ హీరోలు కూడా ఎవరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గా  పెద్దగా నటించింది లేదు. చింతకాయల రవి సినిమాలో కూడా వెంకటేష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నని అబద్ధమే చెప్తాడు కానీ అతడు కూడా పెద్దగా  కనిపించడు ఆ  పాత్రలో అయితే ఇప్పుడు బాలయ్య చరిత్ర వారి చరిత్ర తిరగరాస్తున్నాడా లేదా సమస్యలు కొని తెచుకుంటాడా అన్న ప్రశ్న చిత్ర సీమలో చెక్కర్లు కొడుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: