మొన్న ఆదివారం తో బిగ్ బాస్ మూడవ సీజన్ ముగిసిపోయింది. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన ఈ షో లో దాదాపు వంద రోజుల ప్రయాణం ముగించుకున్న ఇంటి సభ్యులు మరియు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ తమ మామూలు జీవితం లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా ఎవరు ఎంత సంపాదించారో ఒక లుక్కేద్దాం.

ముందుగా మన మన్మధుడు నాగార్జున హోస్ట్ చేసినందుకు గాను 30 ఎపిసోడ్ లకు 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. తన పుట్టిన రోజుని జరుపుకోవడం కోసం అతను స్పెయిన్ కు వెళ్ళినా అతని రెమ్యునరేషన్ లో ఎటువంటి మార్పులు లేవని తెలిసింది. ఈ మొత్తం గత రెండు సీజన్లకు గాను ఎన్టీఆర్ మరియు నాని తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువే. 
ఇకపోతే సీజన్ విజేత అయినా రాహుల్ 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలవగా దాని లో 30 శాతం ట్యాక్స్ రూపం లో పోనుంది. అయితే అతను ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నందుకు గాను మరికొంత డబ్బులు సమకూర్చుకున్నాడు.

ఇకపోతే రాహుల్ గెలిచినా కూడా శ్రీముఖి అతి భారీ రెమ్యూనరేషన్ పొందనుంది. దాదాపు కోటి రూపాయలు 105 రోజులు ఇంట్లో ఉన్నందుకు గాను అందుకుంది. తెలుగు టెలివిజన్ రంగంలో సుమ తర్వాత ఎక్కువ మొత్తం తీసుకునే శ్రీముఖి బిగ్ బాస్ ద్వారా బాగానే సంపాదించింది. ఇకపోతే ఫైనలిస్టు అయిన వరుణ్, అలీ రెజా మరియు బాబా భాస్కర్ దాదాపు 20 నుండి 25 లక్షల వరకు పొందినట్లు సమాచారం. వరుణ్ శివబాలాజీ లాగా ఏదో ఒక వ్యాపారం పెట్టి తర్వాత నటుడిగా నిలదొక్కుకుందాం అనే ఆలోచనలో ఉన్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: