ఇండస్ట్రీలో వారసులు వరుసగా వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న వారసులకి లెక్కే లేదు. ఎంత మంది వారసులొచ్చినా సినిమా బాగుంటేనే చూస్తారనేది తెలిసిన విషయమే. సినిమా బాగొలేకపోతే హీరో ఎవరయినా ప్రేక్షకులు పక్కన పెట్టేస్తారు. పెళ్ళి చూపులు సినిమాతో అద్భుత విజయం అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి గారు తన కొడుకు శివ కందుకూరిని పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం "చూసీ చూడంగానే".


శివ కందుకూరి ని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ శేష్ సింధూ రావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రంలో వ‌ర్ష బొల్ల‌మ్మ‌, మాళ‌వికా స‌తీష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇద్ద‌రు అమ్మాయిల‌తో అబ్బాయి న‌డిపే ప్రేమ నేప‌థ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని సమాచారం. అయితే అయితే ఈ సినిమా టీజర్ ఈ రోజె విడుదలైంది.


ఓ అబ్బాయి మరియు ఇద్దరు అమ్మాయిల మధ్య డిఫరెంట్ టైమ్స్ లో నడిచే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కాలేజ్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ మూవీగా ఉంటుందని తెలుస్తుంది. ఈ మధ్య తెలుగులో కాలేజీ లవ్ స్టోరీస్ రాలేదు. కాలేజీ నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులు కావడంతో ఈ సినిమా ప్రేక్షకులకి ఒక మంచి అనుభూతిని కలిగించేలా ఉంది.


ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా  గోపీ సుందర్ పనిచేయగా సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య, విశ్వా సాహిత్యాన్ని అందించారు. హీరో హీరోయిన్లతో పాటుగా పవిత్ర లోకేష్,రాజేష్ ఖన్నా, వెంకటేష్ కాకుమాను,అనీష్, గురు రాజ్ ఇతర పాత్రలలో నటించారు. త్వరలోనే ఈ మూవీ చిత్ర విడుదల తేదీ ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: