బుల్లితెర షోలను ప్రజెంట్ చేయడంలో ప్రదీప్ కు ఒక విభిన్నమైన స్టైల్ ఉంది. ఈ స్టైల్ వల్ల అతడికి మన తెలుగు రాష్ట్రాలలో అనేకమంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే కొన్ని రోజులుగా ప్రదీప్ ఎక్కడా కనిపించక పోవడంతో ప్రదీప్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

దీనికితోడు ప్రస్తుతం బుల్లితెర పై అతడు హోస్ట్ చేసే కార్యక్రమాలు ఏమి కనిపించకపోవడంతో పాటు సోషల్ మీడియాలో నిరంతరం సందడి చేసే ప్రదీప్ ఎక్కడా కనిపించక పోవడంతో ప్రదీప్ కు ఏమైంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా యాంకర్ రవి ఈ మధ్య ఒక మీడియా సంస్థతో అన్న కామెంట్స్ మరింత గందరగోళానికి తెర తీస్తున్నాయి.  

త్వరలోనే ప్రదీప్ వస్తాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ రవి కామెంట్స్ చేసాడు. అయితే ఈ కామెంట్ ను కొందరు వేరే విధంగా అర్ధం చేసుకుంటూ రవి ప్రదీప్ విషయంలో ఇలా ఎందుకు కామెంట్స్ చేసాడు అంటూ లోతైన అన్వేషణ చేస్తున్నారు. వాస్తవానికి చిన్నపాటి అనారోగ్య పరిస్థితి అయితే ఇన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 

ఆమద్య డెంగ్యూ అన్నారు అదే నిజం అయితే ఈపాటికి రికవర్ అయి  మళ్లీ తిరిగి రావాలి కదా అంటూ అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ఆరోగ్యం బాగాలేకుంటే సోషల్ మీడియాలో అయినా చిన్న పోస్ట్ పెట్టినా ఇలాంటి గాసిప్పులు ఉండవని అనవసరంగా ఇలాంటి నెగిటివ్ వార్తలను ప్రదీప్ ఎందుకు కేర్ చేయడంలేదు అంటూ మరికొందరు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. పలు రియాల్టీ షోలతో పాటు అవార్డు ఫంక్షన్స్ సినిమా వేడుకల్లో తెగ హడావిడి చేసే ప్రదీప్ ఇప్పుడు ఎక్కడా కనిపించక పోవడంతో అతడి అభిమానులు చాల నిరాశకు గురౌతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: