ఇప్పటి వరకు తెలుగు తెరపై కన్నడ నటులు ఎంతో మంది వచ్చారు. అప్పట్లో చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన కన్నడ ప్రభాకర్ అంటే తెలియని వారు ఉండరు.  నటుడుగానే కాకుండా ఆయన పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.  మలయాళం, తమిళం, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. 450 కి పైగా సినిమాల్లో కన్నడ ప్రభాకర్ నటించారు. ప్రముఖ నటులు రాజ్ కుమార్ తర్వాత విష్ణువర్థన్,  శంకర్ నాగ్, రమేష్ అరవింద్, దేవరాజ్ ల తర్వాత ఉపేంద్ర హీరోగా ఎన్నో సన్సేషన్ మూవీస్ తో తెలుగు తెరపై కనిపించాడు. 

ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూనే హీరోగా దుమ్మురేపుతున్నాడు. తాజాగా ‘కబ్జా’ సినిమాలో నటిస్తున్నారు ఉపేంద్ర. అండర్‌ వరల్డ్‌ మాఫియా మొత్తాన్ని కబ్జా చేస్తానంటున్నారు ఉపేంద్ర. 1980లో అండర్‌ వరల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్‌. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం.  అయితే ఈ మూవీ ఏడు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట.. ప్రముఖ నటులు విలన్లుగా నటించబోతున్నారట.

బాలీవుడ్‌కు చెందిన నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రకాశ్‌రాజ్‌, జగపతి బాబు, జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్‌ రావత్‌, సముద్రఖణిలను విలన్‌ లుగా తీసుకున్నామన్నారు.  ఆడియెన్స్ అంచనాలకు మించి సినిమాని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చండ్రు ఇటీవల మీడియాకు వివరణ ఇచ్చాడు. ‘కబ్జా’లో ఉపేంద్ర ‘ఓం’ సినిమా తరహాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. హీరోయిన్‌తో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: