తెలుగులో  ఫేడవుట్ అయిన కృతి కర్బందా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అక్కడ అమ్మడికి ఓ మోస్తారు క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈమధ్య బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో కృతి చాలా క్లోజ్ గా ఉంటుంది. అందుకే ముంబై మీడియా వీరిద్దరి లవ్ కన్ఫాం చేస్తూ వార్తలు రాస్తుంది.


పులకిత్ తో కృతి డేటింగ్ లో ఉందంటూ నానా హంగామా చేస్తుంది. ఆల్రెడీ వీరిద్దరు కలిసి వీర్ కి వెడ్డింగ్ సినిమాలో నటించారు. లేటెస్ట్ గా మరోసారి పాగల్ పంతీ సినిమాలో నటించారు. సినిమా షూటింగ్ టైంలో ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లిందని తెలుస్తుంది. అయితే పులకిత్ తో తనపై వస్తున్న వార్తలను కొట్టిపడేసింది కృతి కర్బందా.


పులకిత్ తనకు మంచి స్నేహితుడని.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అంటుంది కృతి. తనేంటో నాకు బాగా తెలుసని అతని ఏం ఆలోచిస్తాడో కూడా తెలుసని.. అయితే తన లైఫ్ లో అతను చాలా స్పెషల్ అంటుంది కృతి. మరి రిలేషన్ ఏమి లేదంటూ స్పెషల్ అని చెప్పడం ఏంటని అంటున్నారు సిని విశ్లేషకులు. 


తెలుగులో ఎంత ప్రయత్నినంచినా సరే తగిన క్రేజ్ అందుకోని కృతి కర్బందా హిందిలో మాత్రం క్లిక్ అయిందని చెప్పొచ్చు. తెలుగులో తీన్ మార్ సినిమాలో అమ్మడి నటనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అయితే తెలుగు కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నా సరైన అవకాశాలు మాత్రం రావట్లేదని తెలుస్తుంది. మరి కృతి కర్బందాకు తెలుగులో ఛాన్స్ ఇచ్చే డైరక్టర్ ఎవరన్నది చూడాలి. బ్రూస్ లీ సినిమాలో రాం చరణ్ సిస్టర్ పాత్రలో నటించిన కృతి కర్బందా తర్వాత తెలుగు సినిమా చేయలేదు. హిందిలో బిజీగా ఉంది కాబట్టి ఇక్కడ అవకాశాల కోసం అమ్మడు ప్రయత్నించలేదని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: