మహేష్ బాబు భరత్ అను నేను, మహర్షి సినిమాలతో బాగానే పుంజుకున్నారు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఆయనకు దక్కడంలేదు. రంగస్థలంతో  రాం చరణ్ దుమ్ము లేపేశాడు. ఆ తరువాత వచ్చిన మహేష్ కి వరసగా రెండు సినిమాలూ హిట్లే పడ్డాయి. ఇపుడు మహేష్ ఫ్యాన్స్ చూపు బ్లాక్ బస్టర్ మీద ఉంది. సంక్రాంతి పండుగ వేళ వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ఆ కొరత తీరుస్తుందా అన్నది పెద్ద చర్చగా ఉంది.


మహేష్ మూవీ అందునా సంక్రాంతి కాబట్టి ఆ కిక్కే వేరు అనుకున్నా సంక్రాంతికి సోలో గా వచ్చే మూవీ కాదు, పక్కల్లో బల్లెంలా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో అన్న మూవీ రెడీగా ఉంది. ఇక మరో వైపు దర్బార్ మూవీతో రజనీకాంత్ దూసుకువస్తున్నాడు. మాస్ అండ్ క్లాస్ పండుగ సంక్రాంతికి ఎవరు విజేతలైనా అందరూ కలసి కలెక్షన్లు పంచుకోవాలి. దాంతో బ్లాక్ బస్టర్ హిట్ మహేష్ బాబు కొట్టడం సాధ్యమేనా అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.


అయితే ఈ ఏడాది ఎఫ్ టు మూవీతో సంక్రాంతికి వచ్చి సందడి చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి 2020లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం  ష్యూర్ అంటున్నారు. సరైన కంటెంట్ తో పాటు ఆడియన్స్ పల్స్ పట్టుకునే అతి కొద్ది మంది డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు అంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు  ఎటూ హీరోగా ఉన్నారు. అందాల రష్మిక ఉంది. అదే విధంగా విజయశాంతి చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా ప్లస్ పాయింట్లు ఉన్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ అంటున్నారు. మరి చూడాలి మహేష్ కొరిక తీరుతుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: