ఓ నెటిజెన్ కామెంట్ కి బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే అభిషేక్‌ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం ఓ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘జీవించడానికి గల ప్రయోజనాన్ని తెలుసుకోండి. జీవితానికి ఓ గోల్‌ను ఏర్పాటు చేసుకోండి. అసాధ్యమైన దానిని సాధించి.. అది అసాధ్యమైన పని కాదని ఈ ప్రపంచానికి తెలియజేయండి’ అని పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్‌ అభిషేక్ బచ్చన్ ను నిరుద్యోగిగా పేర్కొంటూ కామెంట్‌ చేశారు. 
'సోమవారం కూడా సంతోషంగా ఉండే వ్యక్తిని మనం ఏమంటామ్‌? నిరుద్యోగి..!’ అని ఓ నెటిజెన్ అభిషేక్ బచ్చన్ ను ఉద్దెశించి కామెంట్ చేశారు. తనపై వచ్చిన ట్రోల్‌ను హుందాగా స్వీకరిస్తూ,  అభిషేక్ బచ్చన్ 'మీ కామెంట్‌తో విభేధిస్తున్నాను. కొందరు వ్యక్తులు ఏ పని చేసినా తాము చేసే పనిని పూర్తి ఇష్టంతో చేస్తారు.’ అని అద్భుతం గా రిప్లై ఇచ్చారు. 
ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్స్ కు విరామం ఇస్తూ తనకిష్టమైన ప్రాజెక్టులపై పనిచేస్తూ ఎక్కువసమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ ను ఓ నెటిజెన్ ట్రోల్ చెయ్యగా అభిషేక్ ఏ మాత్రం తగ్గకుండా మంచి రిప్లై ఇచ్చి నెటిజెన్స్ అభినందనలను అందుకున్నారు. ఇక అభిషేక్ బచ్చన్ తన తదుపరి సినిమా లో అజయ్ దేవగన్ తో నటిస్తున్నట్లు సమాచారం.  వీరిద్దరూ ఏడు సంవత్సరాల క్రితం బోల్ బచ్చన్ లో నటించారు. మళ్ళీ చాలా కాలం తరవాత ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు కావున ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కు ఇంకా పేరు ఖరారు కాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: