టాక్ బాగున్న సినిమాలకు కూడా ఈ మధ్య కలెక్షన్లు రావడం కష్టమైపోతోంది. అలాంటిది నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకైతే ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. కానీ రెండు సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తోనూ బిలియన్ క్లబ్ లో చేరాయి. ట్రేడ్ పండిట్స్ ను షాక్ లో పడేశాయి. 


"హౌస్ ఫుల్ 4" సినిమాకు బాలీవుడ్ లో కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో కథలేని, కామెడీ సీన్ లు నాసిరకంగా ఉన్నాయనే టాక్ వచ్చింది. రివ్యూవర్స్ చాలామంది ఒకటి ఒకటిన్నర రేటింగ్సే ఇచ్చారు. కానీ ఈ సినిమా వీకెండ్స్ లోనే వందకోట్లు దాటేసింది. బిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యింది. 


"హౌస్ ఫుల్ 4" మాత్రమే కాదు.. "భారత్" సినిమా కూడా నెగిటివ్ రివ్యూస్ వచ్చినా బిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యింది. "భారత్" లో గెటప్పులెక్కువ, కంటెంట్ తక్కువ అనే టాక్ వచ్చినా, మంచి వసూళ్లు సాధించింది. సల్మాన్ ఖాన్ కు కొంతలో కొంత ఊరటనిచ్చింది. 


"భారత్", "హౌస్ ఫుల్ 4" సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ వచ్చినా.. వసూళ్లు రావడానికి స్టార్ డమ్ ఓ కారణమైతే.. కాంపిటీషన్ లేకపోవడం మరో సీజన్ అని చెప్పొచ్చు. సల్మాన్ ఖాన్ "భారత్" రిలీజ్ అయినప్పుడు ఈ మూవీకి పెద్దగా పోటీ లేదు. పైగా సమ్మర్ లో బ్లాక్ బస్టర్ లేకపోవడంతో బాక్సాఫీస్ కూడా డల్ అయ్యింది. అందుకే జూన్ 5న ఈద్ కు "భారత్" రిలీజ్ అవ్వగానే స్టార్ డమ్  తో ఓపెనింగ్స్ వచ్చాయి. కలెక్షన్లు ఓకే అనిపించుకున్నాయి. 


"హౌస్ ఫుల్ 4" సినిమా రిలీజ్ టైం లోనూ పెద్ద కాంపిటీషన్ లేదు. ఈ మూవీతో పాటు వచ్చిన తాప్సీ "సాండ్ కీ అంఖ్" లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా నిలిస్తే.. రాజ్ కుమార్ రావ్ "మేడ్ ఇన్ చైనా" పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. పైగా అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్ ముఖ్ లాంటి స్టార్ కాస్ట్ కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యింది. కంటెంట్ లేకపోయినా కాస్టింగ్ తో కలెక్షన్లు తెచ్చుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: