పూరీ ఎక్కడంటే.. ఉంటే ఇంట్లో.. లేదంటే.. బ్యాంకాక్ లో ఉన్నట్టే. కథ రాసుకోవడం నుంచి షూట్ చేయడం వరకు ఆయనకు అన్నీ బ్యాంకాకే. అయితే.. ఇపుడు బ్యాంకాక్ ప్లేస్ కు గుడ్ బై చెప్పేసి కొత్త ప్లేస్ వెతుక్కున్నాడు. దేశం దాటకుండా. ఇండియాలోనే బ్యాంకాక్ ను చూసుకుంటున్నాడు పూరీ. 


బ్యాంకాక్ పేరు చెప్పగానే.. ఆటోమెటిక్ గా పూరీ కూడా గుర్తుకొస్తాడు. పోకిరి, దేశముదురు, చిరుత. ఇలా పూరీ సినిమా ఏది తీసుకున్నా.. బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ ఉండాల్సిందే. పూరీ డైరెక్ట్ చేసిన చాలా కథలు.. బ్యాంకాక్ బీచ్ లో పుట్టినవే. అయితే ఈ మధ్య బ్యాంకాక్ మాట ఎక్కడా వినిపించడంలేదు. 


పూరీ జగన్నాథ్ కు గోవా సెంటిమెంట్ టెంపర్ నుంచి మొదలైంది. సినిమాలోని బీచ్ సాంగ్స్.. సీన్స్ అన్నీ గోవాలో తీసినవే. సినిమా హిట్ కావడంతో.. గోవా కూడా సెంటిమెంట్ గా మారిపోయింది. వరుణ్ తేజ్ తో తీసిన లోఫర్.. నితిన్ తో తీసిన హార్ట్ ఎటాక్ ను గోవాలో చిత్రీకరించాడు పూరీ. అలాగే.. ఛార్మితో తీసిన జ్యోతిలక్ష్మి కోసం బ్యాంకాక్ వెళ్లకుండా.. గోవా చుట్టొచ్చాడు. టెంపర్ తర్వాత తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా గోవాను మాత్రం వదిలిపెట్టలేదు పూరీ. ఇస్మార్ట్ శంకర్ కోసం రెండు బీచ్ సాంగ్స్ ను అక్కడే చిత్రీకరించి ఫామ్ లోకి వచ్చాడు. దీంతో విజయ్ దేవరకొండతో తీసే సినిమా షూటింగ్ ను కూడా అక్కడే ప్లాన్ చేశాడు పూరీ. 


మొత్తానికి మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బ్యాంకాక్ ను మరిపోయాడట. ఇపుడు ఇండియాలోనే బ్యాంకాక్ లాంటి ప్లేస్ ను వెతుక్కున్నాడు. అక్కడే తాను అనుకున్న లొకేషన్స్ ను సెట్ చేసి మూవీస్ తీయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఎపుడూ బ్యాంకాక్ ను పరితపించే పూరీ ఎందుకిలా మారిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. ఎక్కడైతే ఏం తాను అనుకున్న కంటెంట్ వస్తే చాలు అనేలా పూరీ మైండ్ లో ఫిక్స్ అయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: