బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో స్టార్లు హోస్ట్‌గా చేయడం వల్ల ఆ షోకి మరింత క్రేజ్ పెరిగింది. మొదటి సీజన్లో జూనియర్
ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ సీజన్
నాని మెప్పించారు. ఇక మూడో సీజన్లో
కింగ్ నాగార్జున హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఫైనల్ కి వెళ్లిన
రాహుల్,
శ్రీముఖి,
బాబా మాస్టర్,
అలీ,
వరుణ్ లలో ఫైనల్
విన్నర్ గా
రాహుల్ గెలిచాడు. ఈ గ్రాండ్ ఫైనల్ కు
మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్బంగా గెలిచిన
రాహుల్ కి
విన్నర్ ట్రోపిని అందజేశారు. ఇక రన్నరప్ గా
శ్రీముఖి నిలిచింది.
మొదటి నుంచి
బిగ్ బాస్ కు మంచి రేటింగ్ వస్తుంది. ఈ మూడో సీజన్ కి కూడా అదే రేంజ్ లో రేటింగ్ వచ్చింది. ఇక వచ్చే ఏడాది రాబోతున్న
బిగ్ బాస్ సీజన్ 4కి హోస్ట్ గా ఎవరు వ్యవహరించబోతున్నారు అనే దాని పై ప్రేక్షకుల్లో అప్పుడే అంచానాలు మొదలయ్యాయి. తాజాగా నిన్నటి షోకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన
మెగాస్టార్ చిరంజీవి గారు, రాబోయే సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారని పలు
టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి.
వాస్తవానికి అందుకోసమే ఆయనను ఈ సీజన్ ఫైనల్
ఎపిసోడ్ కి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగిందని అంటున్నారు. విషయం తెలుసుకున్న
మెగాస్టార్ ప్యాన్స్ చాల
ఖుషి అవుతున్నారు. ఇక బిల్లితెరపై
మెగాస్టార్ ఎలా సందడి చేస్తారో ఇటీవలే
బిగ్ బాస్ రెండో సీజన్ ఫైనల్ లో చూసాం. ఇప్పుడు ఆయనే
బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తే అదిరిపోవడం ఖాయం. అయితే గతంలో
మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్‌గా చేశారు కాబట్టి బెల్లి తెర పైన ఆల్రెడీ ఆయన్ని ప్రేక్షకులు చూశారు. ఇక ఈ
రియాల్టీ షో లో ఆయన హోస్టింగ్ ఎలా ఉండబోతుంది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.