స్వీటీ అనుష్కసినిమా చేస్తుంది అంటే అది కచ్చితంగా సంచలనమే అన్నట్టుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సినిమా ఫీమేల్ లీడ్ సినిమాలతో అనుష్క చేస్తున్న ప్రయోగాలు ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాయి. భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న మరో క్రేజీ మూవీ నిశ్శబ్ధం. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కోనా వెంకట్ ఫిల్మ్ కార్పోరేషన్ లో కోనా వెంకట్ నిర్మిస్తున్నారు. 


సినిమా మొత్తం ఫారిన్ లోనే షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. టీజర్ చూసిన తర్వాత మళ్లీ అనుష్క పక్కా కమర్షియల్ హిట్ కొడుతుందని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాతో కేవలం వసూళ్లు మాత్రమే కాదు అవార్డులు కూడా గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు.


నిశ్శబ్ధం సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డమ్ పాత్రలో నటిస్తుంది. ఇక టీజర్ లో ఆమె అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో అనుష్క మాత్రమే కాదు అనంజలి, షాలిని పాండే కూడా నటించారు. సినిమాలో ఇద్దరు వారి పర్ఫార్మెన్స్ కూడా అందరిని అలరిస్తుందని తెలుస్తుంది.     


డిసెంబర్ 20న సుప్రీం హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజు పండుగే సినిమా రిలీజ్ అవుతుంది. ఇక దీనితో పాటుగా నందమూరి బాలకృష్ణ రూలర్ కూడా అదే రోజు రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే అదే డేట్ న వస్తున్న నిశ్శబ్ధం కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. సోలోగా సినిమాలు తీసి హిట్ అందుకోవడం అనుష్కకు అలవాటే. మరి నిశ్శబ్ధం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.  పోటీలో నెగ్గి మరోసారి అనుష్క తన సత్తా చాటాలని చూస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: