మహానటి సావిత్రి కాలంలో ఒక హీరోయిన్ కి కెరీర్ స్పాన్ చాలా ఎక్కువగా ఉండేది. సావిత్రి, జమున, భానుమతి, శ్రీదేవి, జయసుధ..ఇలా అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరు కూడా వందల్లో సినిమాలు చేసేవారు. అయితే ఇప్పటి హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటోంది. తిప్పి కొడితే 30-40 సినిమాలు చేయలేకపోతున్నారు. సీనియర్ హీరోయిన్లు కొందరు దాదాపు 15 ఏళ్ళు తమ కెరీర్ కొనసాగించగలిగారు. కానీ ఈ కాలం హీరోయిన్లకు మాత్రం అది చాలా కష్టంగా మారింది. ఉదాహరణ కి రకుల్ ప్రీత్ సింగ్ విషయమే తీసుకుంటే ఓ రెండేళ్ళ క్రితం మాంచి ఫామ్ లో ఉండేది. కానీ ఇప్పుడు తెలుగులో అవకాశాల్లేక అల్లాడిపోతోంది. అందుకే ఇక చేసేదేమి లేక బాలీవుడ్ వైపు ఆశగా చూస్తోంది. 

నిజానికి రకుల్ 'స్పైడర్'(2107) తర్వాత తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ సినిమా తర్వాత 'ఎన్టీఆర్ కథానాయకుడు' లో ఒక క్యామియోలో నటించింది. ఈ ఏడాది అక్కినేని నాగార్జున సినిమా 'మన్మథుడు-2' లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో రకుల్ ఇమేజ్ మొత్తం పడిపోయింది. దీంతో అప్పటి నుంచి రకుల్ కి ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ టాలీవుడ్ ఆఫర్ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లోనూ హిందీలో ఒక సినిమాలోనూ నటిస్తోంది. అందుకే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీపైనే ఎక్కువగా దృష్టి పెట్టి ఎలాగైనా బాలీవుడ్ లో ఛాన్సులు దక్కించుకోవాలని ప్లాన్స్ వేసుకుంటుందట. 

అయితే ఇలా బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తే.. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఇక కంప్లీట్ గా రకుల్ కి అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. గతంలో ఇలియానా విషయంలో ఇలానే జరిగింది. ఈ రకంగా చూస్తే  రకుల్ కెరీర్ టాలీవుడ్ లో ముగిసినట్టేననిపిస్తోంది. ఎందుకంటే పెద్ద స్టార్ హీరోలు తమ సినిమాలకు రకుల్ ను సంప్రదించడంలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో లక్కీగా ఒక క్రేజీ ఆఫర్ దక్కించుకొని అందరికి షాకిస్తుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: