తెలుగు ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో మహేష్ బాబు సరసన రష్మిక మందన నటిస్తుంది.  ఛలో చిత్రం తర్వాత రష్మకకు వరుసగా తెలుగు హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటుంది. అయితే ఈ మూవీలో మరో విశేషం ఏంటేంటే మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా గడిపిన..గడుపుతున్న ప్రముఖ నటి విజయశాంతి దాదాపు పదిహేనేళ్ల తర్వాత వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.

ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ ఏడాది ప్రారంభంలో కశ్మీర్‌లో చిత్రీకరించారు. ఆర్టికల్‌ 370 రద్దు జరగడానికి ఒకరోజు ముందు కశ్మీర్‌లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది.  అయితే షూటింగ్ సమయంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయాన్న భయం ఒకింత ఉండేదట చిత్ర యూనిట్.  ఈ నేపథ్యంలో కశ్మీర్‌ షూటింగ్‌ సమయంలో మహేశ్‌బాబుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు చిత్ర సహ నిర్మాత అనిల్‌ సుంకర తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనీల్ సుంకర మాట్లాడుతూ..కశ్మీర్‌లో మా సినిమా చిత్రీకరణకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అనుమతి ఇచ్చారు. దాంతో మహేశ్‌ బాబు కి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల మహేశ్‌ పహాల్గమ్‌కు చేరుకునేవారు.

కానీ మిగిలిన చిత్రబృందానికి పహాల్గమ్‌కు అనుమతి ఉండేది కాదు. మొత్తానికి అక్కడ షూటింగ్ జరిగినంత సేపు మేం టెన్షన్ వాతావరణంలోనే ఉన్నామని అన్నారు. అయితే ఇన్ని ఆంక్షలు మాపై ఎందుకు ఉన్నాయో అప్పట్లో అర్థం కాలేదని అన్నారు. అయితే ఆర్టికల్‌ 370 గురించి తెలిసిన అర్థమైనంది..సెక్యూరిటీ మాపై అందుకే ఆంక్షలు పెట్టారని.  షూటింగ్‌ తర్వాత మేము ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాం అని అనిల్‌ తెలిపారు.   ఈ సినిమాలో విజయశాంతి ప్రొఫెసర్‌ భారతి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: