చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి ఎంతో శ్రమించారు. ఎన్నో సాహసాలు చేశారు. అంతకుమించి ఎన్నో ప్రయోగాలు చేశారు. దాదాపు 25 ఏళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ప్రత్యేకతను చాటుకుంటు అందరి అభిమాన్ని పొదగలిగారంటే దాని వెనక చిరు హార్డ్ వర్క్ మాటల్లో చెప్పలేనిది. శతాధిక చిత్రాల హీరోగా రాణించి.. ఇప్పుడు ఏకంగా 152వ సినిమాలో నటించేందుకు అన్ని రకాలుగా సిద్దమవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. దాదాపు పదేళ్ల విరామం తరువాత 'ఖైదీ నంబర్ 150' తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. 151వ సినిమా 'సైరా: నరసింహారెడ్డి' తరవాత చిరు చేయబోతున్న సినిమాలో మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.

ఇక మెగాస్టార్ కెరీర్ ప్రారంభం నుంచి ద్విపాత్రాభినయంలో వచ్చిన సినిమాల లిస్ట్ చూస్తే పెద్దగానే కనిపిస్తోంది. అంతేకాదు ఇన్ని సినిమాల్లో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. తొలిసారి చిరు 'నకిలీ మనిషి' సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ సినిమాలో హీరోగా.. విలన్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆ తరవాత1982లో వచ్చిన 'బిల్లా- రంగా'.. 1983లో వచ్చిన 'శివుడు శివుడు శివుడు'.. సింహపురి సింహం.. జ్వాల.. రక్త సింధూరం..1987లో వచ్చిన దొంగ మొగుడు.. 1988లో వచ్చిన 'యముడికి మొగుడు ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ అని అందరికి తెలిసిందే. ఆ సినిమాల్లో  త్రిపాత్రాభినయానికి .. చిరు నటనకు గొప్ప పేరొచ్చింది. ఆ తర్వాత అటువంటి పాత్రలు ఎన్నోసార్లు చేసి మెప్పించారు. 

1991లో వచ్చిన 'రౌడీ అల్లుడు'.. 1994లో వచ్చిన 'ముగ్గురు మొనగాళ్లు'.. 1995లో వచ్చిన రిక్షావోడు.. 1999లో వచ్చిన స్నేహం కోసం.. 2005లో వచ్చిన అందరివాడు.. 2017లో వచ్చిన ఖైదీ నంబర్ 150 ఇలా చిరు ఇప్పటి వరకు మొత్తం 14 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. కొరటాలతో చేయబోతున్న సినిమాలో చిరు 15వ సారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఒక నటుడు తన సినీ కెరీర్లో 15 సార్లు ద్విపాత్రాభినయం చేయడం తెలుగు సినీ చరిత్రలోనే కాదు భారతీయ సినీచరిత్రలో అరుదైన రికార్డ్ అని చెప్పాలి. ఇది కేవలం ఒక్క మెగాస్టార్ కే సాధ్యమైన విషయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: