తమిళ యంగ్ హీరో  కార్తి నటించిన లేటెస్ట్  మూవీ ఖైదీ  కి ఇటీవల ఏసినిమాకు రానంత  పాజిటివ్  టాక్  రావడంతో   ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద  దుమ్మరేపుతుంది.  12 రోజులకు గాను  ఖైదీ  తమిళ , తెలుగు వెర్షన్లు కలుపుకొని ప్రపంచ  వ్యాప్తంగా  80కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి  ఈఏడాది  బిగ్గెస్ట్  బ్లాక్ బాస్టర్ దిశగా పయనిస్తుంది.  అలాగే  ఈ చిత్రం  ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో  చేరే  అవకాశాలు వున్నాయి. ఒకవేళ అదే జరిగితే  కార్తి కెరీర్ లో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో చేరనున్న  సినిమాగా   ఖైదీ  రికార్డు సృష్టించనుంది. 




ఇక  ఈసినిమా  థియేట్రికల్ రైట్స్  కేవలం 24కోట్లకే అమ్ముడైయ్యాయి. అయితే  ఇప్పుడు అంతకు మూడు రెట్ల వసూళ్లను రాబట్టడం తో బయ్యర్లు  ఫుల్  ఖుషీగా  వున్నారు.  తెలుగులో   గత రెండు సినిమాలతో  నిరాశపరిచిన  కార్తి తాజాగా ఖైదీ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.  ఈ సినిమాకు వస్తున్న  రెస్పాన్స్ తో కార్తి నటించిన  తదుపరి చిత్రాలకు  తెలుగులో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.  లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని  డ్రీం వారియర్ పిక్చర్స్  పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించగా  సామ్ సీఎస్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.  తెలుగు లో ఈ చిత్రాన్ని  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ విడుదలచేశారు.  ఈ సినిమా కు సీక్వెల్ కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అన్ని కుదిరితే  ఖైదీ 2 వచ్చే  ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఇక  కార్తి ప్రస్తుతం  రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ డైరెక్షన్ లో  సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: