బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ నిలిచేందుకు ఓ హౌజ్ మెట్ కారణమని చెప్పొచ్చు. అదేంటి బిగ్ బాస్ లో ఎవరి గేమ్ వారు ఆడటానికి వచ్చారు మరి అలాంటిది రాహుల్ విన్నర్ అవడానికి దోహదం చేసింది ఎవరు అని ఆశ్చర్యపోవచ్చు. అది ఎవరో కాదు రాహుల్ తో హౌజ్ లో లవ్ ఎఫైర్ నడిపించిన పునర్నవి అంటున్నారు.  


అది ఎలా అంటే.. హౌజ్ లో రాహుల్ ఇరగేసి టాస్కులు ఆడిందేమి లేదు. కాకపోతే అతని మంచితనం ముక్కుసూటిగా మాట్లాడే పద్ధతి బాగుంటుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో 24 గంటలు జరిగే ప్రక్రియలను కేవలం ఒక గంటలో చూపించాలి అంటే ఏది ఎక్కువ జనాలకు నచ్చుతుంది అన్నది చూసి అది టెలికాస్ట్ చేస్తారు.


హౌజ్ లో రాహుల్ తో పునర్నవి చేసిన ఫ్రెండ్ షిప్ అదే కొందరు లవ్ అని కూడా అన్నారనుకోండి. ఆ పునర్నవి వల్ల రాహుల్ బాగా ఎలివేట్ అయ్యాడు. ఇక రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ జరగడం.. ఆ తర్వాత గేమర్ ఈజ్ బ్యాక్ టూ గేమింగ్ అనడం.. ఆ తర్వాత పునర్నవి ఎలిమినేషన్ టైంలో రాహుల్ భావోద్వేగానికి గురవడం లాంటివి జరిగాయి. ఇవన్ని రాహుల్ ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేశాయి.


సో ఎలా చూసినా రాహుల్ టైటిల్ గెలిచేందుకు పునర్నవి కూడా ఓ కారణమని అంటున్నారు. రాహుల్ తో క్లోజ్ గా ఉన్న వరుణ్, వితికలు కూడా రాహుల్ గేం లో భాగమయ్యారు. టైటిల్ ఒక్కడే గెలిచినా రాహుల్ తో పాటుగా వరుణ్ కూడా బిగ్ బాస్ లవర్స్ హృదయాలను గెలిచాడు. రాహుల్ విన్నర్ కాగా శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అయితే గెలిచిన రాహుల్ కన్నా శ్రీముఖి రెమ్యునరేషనే ఎక్కువగా తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: