బుల్లితెరపై యాంకరింగ్ తో పాటు కామెడీ మిక్స్ చేసి ఎంటర్టైన్ చేసే   యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి కనిపించడం మానేసాడు.ప్రస్తుతం ఈటీవీలో ఢీ జోడీతో పాటు జీ తెలుగులో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అంటూ సొంతంగా నిర్మాతగా ఓ టాక్ షో చేస్తున్నాడు.
మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి తప్పుకున్న  ప్రదీప్  కొన్ని రోజులుగా ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు.


దాంతో అభిమానులు బెంగ పెట్టుకుంటున్నారు. ప్రదీప్  రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగాడని ఆయన్ని కాదని.. రవిని రంగంలోకి దించారనే పుకార్లు షికారు చేసాయి.  ప్రదీప్ ఆరోగ్యంపై ఎంత హంగామా జరుగుతున్నా.. సోషల్ మీడియాలో ఇంతగా రచ్చ జరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా ప్రదీప్ బయటికి రావడం లేదు.. దీనిపై ఒక్క ట్వీట్ కానీ.. ఇన్‌స్టాలో మెసేజ్ కానీ చేయడం లేదు. కానీ అది నిజం కాదు... పాపం  ప్రదీప్‌కు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాలేదు.


ప్రదీప్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు.. అందుకే ఆయన బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడట.దీంతో ప్రదీప్ ఈ షో నుంచి తప్పుకోడానికి కారణం పారితోషికమో.. లేదంటే కామెడీ రాకపోవడమో కాదని ఇప్పటికే అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. కానీ ఇప్పటికీ ఈయన రాకపోవడంపైనే అనుమానాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న యాంకర్ రవి కూడా యూ ట్యూబ్‌లో ప్రదీప్ రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రదీప్ అనారోగ్యం నుంచి బయటపడ్డాడని.. కానీ బుల్లి తెర కంటే ముందు హీరోగా చేస్తున్న సినిమాను కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడని టాక్.సినిమా పూర్తైన తర్వాత బుల్లితెరపై మళ్లీ పవర్ ఫుల్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు ప్రదీప్. 


కచ్చితంగా నేడో రేపో ప్రదీప్ వచ్చి దీనిపై క్లారిటీ ఇస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఆరు వారాల విశ్రాంతి ఇప్పటికే చివరికి వచ్చేసిందని.. కచ్చితంగా మరో రెండు వారాల్లో ప్రదీప్ బుల్లితెరపై కనిపించడం ఖాయం అంటున్నారు ప్రదీప్ సన్నిహితులు. తెలుగు బుల్లితెరపై ఎప్పుడూ బిజీగా ఉండే ప్రదీప్.. ఇలా ఒక్కసారిగా కనిపించడకుండా ఉండటాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రెమ్యునరేషన్ రూమర్స్ కూడా రావడంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి.  మొత్తానికి ఈయన రీ ఎంట్రీ కోసం వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త ఎప్పుడొస్తుందో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: