తెలుగులో తరువాత  మళయాలం లో  భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు  స్టార్ హీరో స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్.  ముఖ్యంగా  సరైనోడు  తో బన్నీకి అక్కడ  క్రేజ్ బాగా వచ్చింది.  ఈసినిమా తరువాత  ఆయన నటించిన  సినిమాలు  మలయాళంలో  డబ్ అయ్యి అక్కడి అభిమానులను  ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు  అల్లు అర్జున్ మలయాళీ ఫ్యాన్స్ కోసం  సప్రైజ్ ఇవ్వడానికి  రెడీ అవుతున్నాడు.  అందులో  భాగంగా  అయన నటిస్తున్న  లేటెస్ట్ మూవీ  అల.. వైకుంఠపురములో ..  మలయాళ వెర్షన్  టైటిల్ మరియు  ఫస్ట్ లుక్  ను  రేపు ఉదయం 11 గంటలకు విడుదలచేయనున్నారని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అధికారకంగా ప్రకటించారు.


ఇక  ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  యూరప్ లో జరుగుతుంది.  ఈ షెడ్యూల్ లో లీడ్ పెయిర్ పై  సూపర్ హిట్ మెలోడీ  సామజవరగమన సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విడుదలైన  ఈ సాంగ్  సెన్సేషన్  సృష్టించి  అత్యధిక లైకులను రాబట్టిన సౌత్ సాంగ్ గా  రికార్డు నెలకొల్పింది. ఈసాంగ్ తోపాటు కొద్దీ రోజుల క్రితం విడుదలైన రెండో సాంగ్ రాములో రాముల కూడా సేమ్ రెస్పాన్స్ ను రాబట్టింది. దాంతో ఈచిత్రం  పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  



  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్  లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో  బన్నీ కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుండగా టబు ,జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజు  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది.  అయితే ఈచిత్రం  తెలుగు తోపాటు మళయాలం లోకూడా  ఒకేసారి విడుదలవుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: