ప్రతిష్టాత్మకంగా రూపొందిన దర్బార్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేశారు. రజినీకాంత్.. మురుగదాస్ కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని  క్రేజ్ వస్తుంది సినీ ప్రేక్షకులకు. రజినీకాంత్ కొత్త సినిమా దర్బార్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.  ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు.

సినిమా మోషన్ పోస్టరన్‌ను భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ సూపర్‌స్టార్లతో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్‌ను బరిలోకి దించారు. అయితే, నవంబర్ 7 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దర్బార్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  


తెలుగు తమిళ్ మోషన్ పోస్టర్స్ ను కమల్ హాసన్ రిలీజ్ చేస్తుంటే... మలయాళం మోషన్ పోస్టర్ ను మోహన్ లాల్ చేతుల మీదుగా రిలీజ్ కాబోతున్నది.ఇక హిందీ మోషన్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నారు.పైగా ఇందులో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.25 సంవత్సరాల క్రితం రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.మరలా ఇప్పుడు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండటం విశేషం.వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  


దర్బార్ మోషన్ పోస్టర్ గురించి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ట్వీట్ చేశారు. దర్బార్ మోషన్ పోస్టర్‌ను భారతీయ సినీ దిగ్గజాల చేత ఆవిష్కరింప చేస్తున్నానని చెప్పడానికి గర్వంగా ఉంది. ఇందు కోసం కమల్ హాసన్ సర్, సల్మాన్ ఖాన్ సర్.. మోహన్ లాల్ సర్‌ను ఒప్పించాం. గురువారం అనిరుధ్ మాస్ మ్యూజిక్‌తో తలైవర్ రజనీకాంత్ రాక కోసం వేచి చూడండి అని మురుగదాస్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: