ఆనందంగా ఉండే మాటలురాని ఆర్టిస్ జీవితాన్ని ఓ విహారయాత్ర.. పీడకలగా ఎలా మార్చిందన్నదే కథాంశంతో  నిశ్శబ్దంగా మనముందుకు వస్తుంది స్వీటీ. సైరా సినిమాలో అలా మెరిసి వెళ్లిపోయిన అనుష్క మెయిన్ రోల్‌గా భారీ మల్టీ లింగ్వల్ సినిమాతో రాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ప్రేక్షకుల్ని క్షణక్షణం ఉత్కంఠతో కట్టేయబోతోంది. వెండితెర జేజమ్మ బర్త్ డే సందర్భంగా కొత్త లుక్‌తో అభిమానుల ముందుకొచ్చింది.మూకీ సైగలతో ‘నిశ్శబ్దం’గా స్టన్ చేస్తోంది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్  అనుష్క అభిమానులకు మాటలు రాని ఆర్టిస్ట్.. భయపడుతూ సైగలు చేస్తుంది.‘నిశ్శబ్దం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అనుష్క బర్త్ డే (నవంబరు 7) గిఫ్ట్‌గా ఒకరోజు ముందుగా బుధవారం రిలీజ్ చేశారు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. సస్పెన్స్ రేపే బ్యాగ్ రౌండ్ మ్యూజిక్‌తో ఉత్కంఠ కలిగించేలా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఈ సినిమాలో అనుష్కకు మాటలు రాని ఆర్టిస్ట్‌గా నటిస్తోంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్రముఖ ద‌ర్శకుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేయ‌గా.. హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్టర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు. ఇప్పటికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ప్రీ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచ‌గా.. ఇప్పుడు విడుదలైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది.


పూపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో.... తెలుగులో మంచు విష్ణు, తాప్సీలతో వస్తాడు నా రాజు మూవీ తీసిన హేమంత్ మధుకర్ డైరెక్టర్ చేస్తున్నాడు. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుండగా....  అనుష్క, మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఒకేసారి ఐదు భాషల్లో చిత్రీకరణ జరుగుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు షూట్ చేస్తున్నారు. ఇంగ్లిష్ వర్షన్‌కు సైలెన్స్ అని టైటిల్ పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: