ట్యాలెంట్ ఉండి సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు  కోసం  ఎదురుచూస్తున్న  నటీ నటులకు ఇప్పుడొక గోల్డెన్ ఛాన్స్.  చిన్న చిన్న సినిమాల్లో నటించే  ఛాన్స్ కాదు  ఏకంగా  బడా హీరో సినిమా లో కనిపించే అవకాశం మీ సొంతం కానుంది. అయితే ఈఅవకాశం మీకు దక్కాలంటే  మీరు  ప్యూర్ చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడగలిగేలా ఉండాలి.   ఇంతకీ ఆసినిమా ఏంటంటే  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  నటించనున్న 20 వ సినిమా.  



క్రియేటివ్ డైరెక్టర్  సుకుమార్  డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం  ఇటీవలే లాంచ్ కూడా అయ్యింది. ఎర్రచందనం స్మగ్లింగ్  బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడగలిగే నటీనటులను ఎంపిక చేసుకోవడానికి చిత్ర  బృందం ఆడిషన్స్  నిర్వహించనున్నారు. ఈ  ఆడిషన్స్ లో ఎవరైతే  మెప్పిస్తారో  వారికి అల్లు అర్జున్ తో కలిసే నటించే అవకాశం రానుంది. తిరుపతి లోని  తుమ్మలగుంట లో వినాయకుడి గుడి  ప్రక్కన వున్న భువన విజయం హౌస్ లో ఈనెల 9&10 తేదీల్లో ఉదయం  9గంటలనుండి సాయంత్రం 6గంటలకు వరకు  ఈ  ఆడిషన్స్  జరుగుతాయి ఆసక్తి వున్న  వారు 7799679550, 8309234680 నెంబర్ల కు ఫోన్ చేసి ఈ ఆడిషన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.    



మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్  సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది దసరా బరిలో  ఈ చిత్రాన్ని బరిలోకి నిలుపేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం  అల్లు అర్జున్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల.. వైకుంఠపురములో  నటిస్తున్నాడు.  ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత  బన్నీ,  సుకుమార్ తో  సినిమాను మొదలుపెట్టనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: