బాహుబలి-2 లో దేవసేన పాత్రను అందంగా అద్భుతంగా పోషించిన అనుష్క షెట్టి ఆ తరవాత నటించిన భాగమతి చిత్ర నిర్మాణం నుంచే దేశవ్యాప్త ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని నెలకొల్పింది. 

తాజాగా టాలీవుడ్ లో అనుష్క షెట్టి కథానాయికగా నటించిన "నిశ్శబ్ధం" సినిమా టీజర్ సంచలనం మాత్రమే కాదు సంభ్రమం కూడా కలిగిస్తుంది. రెండేళ్ళ క్రితం "భాగమతి" దక్షిణాదిని కుదిపేసింది “లేడీ ఓరియెంటెడ్ లేదా విమెన్ సెంట్రిక్” సినిమాలు ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారని భారతీయ సినీ ట్రేడ్ వర్గాలు నాడు ఎలుగెత్తి చాటాయి.  
Image result for Anushka Nisabdham Movie
బాహుబలి-2 చిత్రంలో దేవసేనగా ఆసేతు శీతాచలం - అపూర్వ అశేష భారతీయ ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది అనుష్క షెట్టి. అందులో ఆమె ఆంగికం,  అభినయం, ఆహార్యం....మరీ ముఖ్యంగా సమున్నత స్వరూపం గెయిటీ  అనితర సాధ్యం అన్నంతగా ఖ్యాతిని స్వంతం చేసుకుంది. 

ఆమె తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు రెండేళ్ళుగా ఆసక్తిగా ఎదురు చూశారు అంటేనే ఆమె నటనపై ప్రేక్షకుల ఆరాధన ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆమె నటించిన “హారర్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా” భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందు కొచ్చింది. టీజర్, ట్రైలర్స్‌లోనే ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించిన ఆ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ   త్రిభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఒక్క తెలుగులో తొలి మూడు రోజుల్లో ఒక మహిళా ప్రధాన చిత్రం ₹ 30 కోట్లకు పైగా గ్రాస్-కలక్షన్లు సాధించి "వసూళ్ల చరిత్ర" లోనే సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ, సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది.  ఇందులో ఒక్క నైజాంలోనే ₹ 10కోట్ల వసూళ్లు రావడం నాటి విశేషం. భాగమతి క్లోజింగ్  బిజినెస్ అక్షరాల డేబ్బై కోట్లు.  మహిళా ప్రధాన చిత్రాల్లో తొలిసారిగా ₹ 50 కోట్ల క్లబ్‌ లో (శాటిలైట్ హక్కులు కాకుండా)  చేరిన తెలుగు చిత్రంగా భాగమతి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 

‘అరుంధతి’, 'పంచాక్షరీ ‘రుద్రమదేవి’ ‘బాహుబలి’ ‘భాగమతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్‌ గా మారిన నటి అనుష్క షెట్టి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాను ఆస్వాదిస్తోన్న అనుష్క బాహుబలితో జాతీయస్థాయి నటిగా అంటే బాలీవుడ్ వరకు ఎదిగి ఒక నటి సామర్ధ్యానికి ఎల్లలు లేవని ఋజువు చేశారు. తాజాగా మరో మహిళా ప్రాధాన్య పాత్రలో "పరిధులు సరిహద్దులు లేవని చాటే ఉద్దేశంతో" ఏమో!  అనుష్క మాట్లాడ‌ లేని మూగ మగువ  'సాక్షి' అనే పాత్రలో న‌టిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’ . రేపు (న‌వంబ‌ర్ 7న‌) అనుష్క పుట్టిన‌రోజును పురష్కరించుకుని టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
Image result for Anushka Nisabdham Movie
డైనమిక్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ ను, త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ ను ప్రముఖ ద‌ర్శకుడు గౌత‌మ్ మీన‌న్, హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్టర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు. ఇప్పటికే విడుద‌లైన ఫ‌స్ట్-లుక్‌, ప్రీ-టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను భారీగా పెంచ‌గా, ఇప్పుడు విడుదలైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను ఇంకా ముందుకు తీసుకెళ్ళింది.  

వెకేషన్ కోసం వెళ్లిన జంటకు అది పీడకలగా ఎలా మారిందో?  ఈ సినిమాలో చూపించనున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.  మాధవన్‌ తో కలిసి అనుష్క వెకేషన్‌కు వెళ్తుంది. అక్కడ అనుకోని సంఘటన జరుగుతుంది. దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఇంతకీ ఆ కథను మలుపు తిప్పే ఘటన ఏమిటనేదే సస్పెన్స్. ఈ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్  కనిపించారు. ఆయన మేనరిజం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం  అలాగే ఇది  ఖచ్చితంగా అనుష్క కు ఇది బాలీవుడ్- హలీవుడ్ క్రాసోవర్ చిత్రం అవ్వటం  ఖాయం.
Image result for Multi Faces of Anushka shetty
తెలుగు, త‌మిళ‌ం, మ‌ల‌యాళ‌ం, హింది, ఇంగ్లిష్ 5 భాష‌ల్లో రూపొందుతోన్న ఈ బహు భాషా చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను జ‌రుపుకుంటుంది. త్వర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించ‌బోతోంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బరాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల, మైకేల్ త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో న‌టించారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, కోన వెంక‌ట్ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: