దగ్గుబాటి రానా తన కెరీర్ మొదటి నుంచి మంచి లుక్స్ తో టాలీవుడ్ లోని అందగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో రొమాంటిక్ బాయ్ ట్యాగ్ ఉన్న రానా గతం లో కూడా త్రిష తో తనకు వ్యక్తిగతమైన సంబంధం ఉన్నట్లు ధ్రువీకరించాడు కూడా. అలాగే చాలా రోజుల పాటు ఒక హైదరాబాదీ అమ్మాయితో డేటింగ్ కూడా చేశాడు. ఏమైందో ఏమో కానీ అన్నింటికీ బ్రేకప్ చెప్పేసి తన మానాన తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. 

మరొకవైపు ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి ఏ ఒక్కరితో పర్సనల్ రెలేషన్స్ పెట్టుకున్నట్లు కనిపించలేదు. అయితే మన ఆరడుగుల అందగాడు అయిన రానాకు మాత్రం ఈ అమ్మడు కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటున్న రానా అనవసరంగా ఆమెతో రొమాంటిక్ రిలేషన్ షిప్ లోనికి లాగబడుతున్నాడు. 

విషయం ఏమిటంటే ఈ మధ్యనే జరిగిన నా ఒక ఇంటర్వ్యూ లో రకుల్ ని, రానాకు తనకకు మధ్య ఉన్న సంబంధం గురించి వివరించమంటే ఆమె వారిద్దరి మధ్య స్నేహం గురించి ఒక బారెడు పడుకున్న పేరాగ్రాఫ్ చదివి వినిపించారు. తనకు మరియు రానాకు మధ్య ఉన్న సంబంధం కేవలం స్నేహం మాత్రమే కానీ ఎటువంటి వ్యక్తిగతమైన సంబంధం లేదని ఆమె తెగేసి చెప్పింది. 

అయితే రానా కుటుంబం మాత్రం ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడం మొదటిసారి కాకపోవడంతో... ప్రతి సారి రానా పేరు రకుల్ తో ముడిపడి రావడం వారికి ఏమాత్రం నచ్చడం లేదట. ప్రస్తుతానికి రానా సింగిల్... అదీ కాకుండా అతను ఇప్పటివరకు ఎవరితో కుదురుగా రిలేషన్ నడిపింది కూడా లేదు. అసలే విపరీతమైన అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రానాను మళ్లీ ఇటువంటి విషయాలు లాగడం వారికి నచ్చడం లేదట. మరి ఇవన్నీ ఎవరు తలచుకుంటే ఆగుతాయో వారికే తెలియాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: