అక్కినేని నాగార్జున సైడ్ క్యారక్టర్ చేయడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. సొంతంగా బ్యానర్.. సినిమా తీయగల స్టూడియో.. పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఇవన్ని ఉండి నాగార్జునకు సైడ్ పాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు. సైడ్ క్యారక్టర్ అంటే ఏదో అలా కనబడే పాత్ర కాదు సినిమాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ ఆయనే కాని హీరో కాదు అలాంటి ఓ సినిమా చేస్తున్నాడట కింగ్ నాగార్జున.


బిగ్ బాస్ హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా తన సత్తా చాటిన నాగ్ ఇక సినిమాల మీద ఫోకస్ పెడుతున్నాడు. లేటెస్ట్ గా ఊపిరి రైటర్ సోలోమన్ నాగార్జునకు ఓ కథ చెప్పాడట. అందులో నాగార్జున పాత్ర చాలా కీలకమని తెలుస్తుంది. అయితే సినిమాలో నాగార్జున మాత్రం హీరో కాదట. సినిమా కథ చాలా కొత్తగా ఉందని తెలుస్తుంది. 


కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వస్తున్న ఈ సినిమాను నాగర్జున దాదాపు ఓకే చేసినట్టు తెలుస్తుంది. మరి అక్కినేని ఫ్యాన్స్ ఈ ప్రయత్నాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సైడ్ క్యారక్టర్ లో నాగార్జున అంటే కచ్చితంగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి చెందే అవకాశం ఉంది. కాని పాత్ర ప్రాధాన్యతను బట్టి నాగార్జునసినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.


ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. బిగ్ బాస్ చేసే టైంలో రెండు మూడు కథలు వచ్చినా అవేవి నచ్చక నో చెప్పిన నాగార్జున ఈ సినిమాతో పాటుగా హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. మరి ఆ సినిమాకు సంబందించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: