పచ్చి అడల్ట్ కామెడీతో, ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమా ‘ఏడు చేపల కథ’. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్‌తో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్ చూసిన చాలామంది దానిలోని మసాలా కంటెంట్ చూసి అసలు ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందా అని అనుమానపడ్డారు.ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ఒక్కరోజు ఉందనగా బుధవారం చిత్ర హీరో అభిషేక్ మీడియా ముందుకు వచ్చారు. నిర్మాత శేఖర్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు‌తో కలిసి హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.


డైరెక్టర్ నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మొత్తం చదివితే అంతా మసాలానే ఇంకేం లేదు.ఈ స్క్రిప్ట్ నేను చదివిన తరవాత దీనిలో నేను హీరో ఏంటండి అని అడిగాను. కానీ, కొత్తోళ్లు సక్సెస్ అవ్వాలి అంటే అడల్ట్ కామెడీ అయినా గట్టిగా కొట్టాలని మా డైరెక్టర్ ధైర్యం చెప్పారు.మొత్తానికి సినిమా సెట్స్‌మీదికి వెళ్లింది.మీ అందరి ద్వారానే యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. ఆ తరవాత మా నిర్మాత మీద పెట్టకూడని పిటిషన్లు అన్నీ పెట్టారు.

నానా ఇబ్బందులు పెట్టి సెన్సార్ ఆఫీసులో డ్రాయర్ మీద నిలబెట్టారు.సెన్సార్ ఆఫీసర్ రాజశేఖర్ ఐఏఎస్ సినిమా చూసిన తరవాత ఒణికిపోయారు. ఈ సినిమాను వదిలితే నా పరిస్థితి ఏంటి? అన్నారు.సెన్సార్ ఆఫీసులో ముగ్గురు లేడీస్ ఉన్నారు. వాళ్లకు ఈ సినిమా చూపించాడు. బ్లర్‌లు కూడా లేకుండా అలాగే వేసి చూపించాడు. సినిమా అయిపోయిన తరవాత ఈయన లోపలికి వెళ్లి వాళ్లకు నమస్కారం పెడుతుంటే.. వాళ్లు పైట్లు కప్పుకున్నారు.


వాళ్లతో మాది డాక్టర్స్ కుటుంబం అండి.. నేను పొలిటీషియన్‌ని, నా కొడుకు డాక్టర్, నా అల్లుడు డాక్టర్ అని చెబుతున్నాడు. ఓరినీ.. నువ్వు డాక్టర్ ఫ్యామిలీ నుంచి అయితే సెక్స్ సినిమా తీస్తావా? నువ్వు మాట్లాడే మాటలకి సినిమాకి సంబంధం ఉందా అని అన్నారు వాళ్లు. కానీ, ఈయనకు వినపడదు. మేడం మీరు కూడా చాలా బాగున్నారు.. నెక్ట్స్ సినిమాలో మీకు అవకాశం ఇస్తా అంటున్నాడు సెన్సార్ ఆఫీసులో ఒకామెతో. ఈయన అమాయకత్వానికి వాళ్లకు తిట్టాలో, బాధపడాలో అర్థం కాలేదు’’ అని తమ ప్రయాణం గురించి వివరించారు హీరో అభిషేక్.


మరింత సమాచారం తెలుసుకోండి: