జేజేమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయమైన కీర్తిని ఆర్జించిన అనుష్క కెరీర్ మొత్తం చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. అనుష్క ఇప్పటికి 14 ఏళ్ళ బట్టి టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఎందరు హీరోయిన్లు వచ్చిన అనుష్క ప్లేస్ ని ఆక్రమించలేకపోతున్నారంటే అది ఆమె గొప్పతనంగానే చెప్పాలి. అనుష్క యోగా టీచర్ గా ఉంటూ సినీ ఫీల్డ్ కి వచ్చారు.


ఆమె కన్నడ కస్తూరి. మంగుళూరికి చెందిన సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె సెన్సేషనల్ డైరెక్టర్  పూరీ జగన్నాధ్ డిస్కవరీ. 2005లో వచ్చిన సూపర్ మూవీలో అక్కినేని నాగార్జున పక్కన నటించిన అనుష్క ఆ తరువాత 2006లో మహానంది మూవీలో యాక్ట్ చేశారు. ఇదే టైంలో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు అనుష్క  కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. ఇక ఆమె టాప్  స్టార్ అయిపోయింది. 


ఆ తరువాత డైరెక్టర్ కోడి రామక్రిష్ణ అరుధతిలో జేజెమ్మగా కనిపించి వెండి తెరపై విశ్వరూపం ప్రదర్శించింది. ఇక అనుష్క రుద్రమదేవిగా, భాగమ‌తిగా నటనకు కొత్త భాష్యం చెప్పారనే అనుకోవాలి. బాహుబ‌లి లో దేవసేన  పాత్రలో అనుష్కను తప్ప ఎవరినీ వూహించుకోవడం కష్ట‌మే. అనుష్క  లేటెస్ట్ గా  నటించిన నిశ్శబ్దం మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. పాత కాలం నాటి హీరోయిన్ల అందం, అభినయంతో పాటు ఈ కాలం నాటి హీరోయిన్ల నాజూకుదనం, చొరవ అన్నీ కలగలసిన అరుదైన హీరోయిన్ గా అనుష్కను చెప్పుకోవాలి. సుదీర్ఘమైన కెరీర్ ఆమెది, అయినా టాప్ స్టార్. లేడీ ఓరెయెంటెడ్ మూవీస్ లో అనుష్క ఫస్ట్ చాయిస్. ఇప్పటికీ ఆమె కోసం దర్శకులు కధలను తయారుచేస్తున్నారంటే అనుష్క గ్రేట్ అనక తప్పదు.  పుట్టిన రోజు సందర్భంగా అనుష్కను జేజేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: