ఒకప్పుడు  వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో నందమూరి బాలకృష్ణకు  దర్శకుడు బోయపాటి శ్రీను సింహా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన లెజెంట్ కూడా అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. బోయపాటి సినిమాలో  హీరోని పవర్ ఫుల్ గా చూపిస్తూ ఉంటాడు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుందంటే ఇక నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సారి మరో మూవీ రాబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ లోనే  దర్శకుడు బోయపాటి శ్రీను తో సినిమా చేయబోతున్నాను  అంటూ బాలయ్య అఫిషియల్ గా  అనౌన్స్ చేశారు. కాగా  మాస్ ఓరియెంటెడ్ గా బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా వచ్చే నెల నుంచి  పట్టాలు ఎక్కనుంది . అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన జెర్ ఫెమ్  శ్రద్ధాశ్రీనాథ్ నటించబోతున్నట్లు సమాచారం. 



 ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను సినిమాలో హీరోని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడు. విలన్ కూడా అంతకు మించి పవర్ఫుల్ గా  చూపిస్తాడు. బాలకృష్ణ మూవీ అంటే  విలన్  ఇంకా ఎంత పవర్ ఫుల్ గా ఉండాలి.  దీనికోసమే బాలీవుడ్ స్టార్ హీరో ని బోయపాటి సినిమా విలన్ పాత్ర కోసం  సంప్రదించాలనుకుంటున్నారట. బాలక్రిష్ణ  ఢీ కొట్టె  విలన్ పాత్రలో సంజయ్ దత్ తీసుకోవాలని దర్శకుడు బోయపాటి భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన మంతనాలు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా  ప్రస్తుతం సంజయ్ దత్ హీరోగా నటిస్తున్న కేజిఎఫ్ లో విలన్ గా నటిస్తున్నారు సంజయ్ దత్ . ఓ వైపు పానిపట్ సినిమాలో కూడా ప్రతినాయకుడిగా మరోసారి నట విశ్వరూపం చూపించబోతున్నాడు సంజయ్ దత్. కాగా  బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 



 ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ కేఏస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత నందమూరి బాలకృష్ణ దర్శకుడు కొరటాల శివ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. కాగా ఈ సినిమాను వచ్చే సమ్మర్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వరకు బాలకృష్ణ హీరోఇజం  కరెక్ట్ గా ఎలివేట్ చేసిన ఒకే ఒక దర్శకుడు బోయపాటి శ్రీను. అందుకే హీరో బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అంటే అటు నందమూరి అభిమానులుల్లోనే  కాదు తెలుగు ప్రేక్షకులందరిలో ఓ రేంజిలో అంచనాలు పెరిగిపోతాయి.మరి  బాలయ్య దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా సంజయ్ దత్  ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: