ఈ మద్య సినీ పరిశ్రమలో చాలా విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.  ఒక హిట్ సినిమా ఒక హీరో చేయాల్సింది కొన్ని కారణాల వల్ల రిజక్ట్ చేయడం...మరో హీరో ఆ ప్రాజెక్ట్ ఒప్పుకొని సూపర్ హిట్ కొట్టడం జరుగుతుంది. అదే విధంగా ఫ్లాప్ మూవీలు కూడా ఇదే తంతు.  అయితే ఫ్లాప్ అయినపుడు అమ్మో ఆ సినిమా నేను చేయకుండా బతికి బయటపడ్డా అని స్టేట్ మెంట్స్ ఇవ్వడం చూస్తున్నాం. ఒకేవేళ హిట్ కొడితే..అయ్యే ఆ సినిమా నేను మిస్ అయ్యానని బాధపడటం చూస్తున్నాం.  


 తాజాగా అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.   ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో బన్ని సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది.  చాలా కాలం తర్వాత ఈ మూవీలో ఒకప్పటి అందాల తార టబు ఓ కీలక పాత్రలో నటిస్తుంది.  ఈ మూవీకి సంబంధించిన రెండు లిరిక్స్ సోషల్ మీడియాలో కుమ్ముస్తున్నాయి.


ఇదిలా ఉంటే నటుడు రాణా  'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ రానా దగ్గుబాటి చేతుల్లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే నాపేరు సూర్య తర్వాత బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ నటించిన ‘  'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ లో నటించాలని ఆలోచించారట..కానీ ఇంతలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నచ్చడంతో ఆ మూవీకి కమిట్ అయ్యారు. తాజాగా  'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ రానా దగ్గుబాటి చేతుల్లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది మల్టీ స్టారర్ మూవీ..సెకండ్ హీరో విశ్వక్ సేన్ అనే ప్రచారం జరుగుతోంది. రానా ఇప్పటికే వేణు ఊడుగుల దర్శత్వంలో 'విరాటపర్వం' మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్.  మొత్తానికి బన్నీ నటించాల్సిన మూవీలో రానా చేతుల్లోకి వెళ్లింది..మరి ఈ మూవీ ఎంత వరకు హిట్ అవుతుంతో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: