అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీకి ‘ఉప్పెన’ అన్న టైటిల్ తాత్కాలికంగా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ కు స్పందన ఊహించిన రేంజ్ లో ఉంటే ఇదే టైటిల్ ను ఖరార్ చేయాలని సుకుమార్ ప్లాన్ అని అంటున్నారు. ఈ నెలాఖరు నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ షూటింగ్ లోకి రావడం లేట్ అయినా ఈలోపున ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసే ఉద్దేశ్యంలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా ఈ మూవీలో విలన్ పాత్రకు తమిళ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించడానికి సుకుమార్ చాల కష్టపడవలసి వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో విలన్ గా నటించడానికి విజయసేతుపతి 3 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఇంత భారీ పారితోషికం ఒక విలన్ పాత్రకు ఇవ్వడం వలన మూవీ బడ్జెట్ పెరిగిపోయినా విజయ్ సేతుపతికి ప్రస్తుతం కోలీవుడ్ లో కొనసాగుతున్న క్రేజ్ రీత్యా ఈ స్థాయిలో భారీ పారితోషికం ఇవ్వవలసి వచ్చింది అని అంటున్నారు. దీనికితోడు ఈ మూవీని తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేసే ఉద్దేశ్యం ఉండటంతో బన్నీకి మార్కెట్ తమిళనాడులో పెరగాలి అంటే విజయ్ సేతుపతి క్రేజ్ ఈ మూవీకి అదనపు ఆకర్షణ అవుతుందని భావించిన సుకుమార్ ఆలోచనలకు బన్నీ సపోర్ట్ కూడ లభించడంతో విజయ్ కు ఇంత భారీ పారితోషికం ఇవ్వడం జరుగుతోంది అని అంటున్నారు.

‘96’ మూవీ తరువాత ఈ తమిళ హీరో మార్కెట్ కోలీవుడ్ లో విపరీతంగా పెరిగిపోయింది. దీనితో ఇతడి డేట్స్ దొరకడమే కష్టంగా మారిన పరిస్థితులలో ఇతడు ఎంత డిమాండ్ చేసినా నిర్మాతలు అతడు కోరుకున్న పారితోషికాన్ని ఇస్తున్నారు. ‘సైరా’ మూవీలో ఒక కీలక పాత్రను చేయడం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ తమిళ హీరో ఇక్కడ విలన్ గా రాణిస్తే రానున్న రోజులలో జగపతిబాబు ఆదిపత్యానికి గండి కొట్టడం ఖాయం అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: