అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ తెలుగులో రాహుల్ సిప్లిగంజ్  విన్ అయ్యాడు. బయట యాంకర్ శ్రీముఖికి ఎంతో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అలాంటి శ్రీముఖిని సైతం వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచాడు. యాంకర్ శ్రీముఖి కంటే రాహుల్ కు 7 శాతం ఓట్లు అధికంగా రావటం గమనార్హం. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అయినందుకు రాహుల్ 50 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ అందుకున్నాడు. 
 
రాహుల్ సిప్లిగంజ్ బయటకు వచ్చిన తరువాత కొన్ని మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో రాహుల్ సిప్లిగంజ్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. యూట్యూబ్ లో తనకు 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని మొదటినుండి సాంగ్ వీడియోస్ తీయడం ప్లస్ అయిందని రాహుల్ సిప్లిగంజ్ చెప్పాడు. రాహుల్ టైటిల్ విన్ కావటానికి ఏపీ సీఎం జగన్ కూడా ఒక రకంగా కారణమని చెప్పాడు. 
 
ఏపీ సీఎం జగన్ కోసం 2019 ఎన్నికల సమయంలో తాను ఒక పాట పాడానని బిగ్ బాస్ టైటిల్ విన్ కావటం వెనుక నేను పాడిన పాట కూడా కారణమని రాహుల్ చెప్పాడు. రాహుల్ ఇంటర్వ్యూలో టైటిల్ విన్ కావటానికి జగన్ కోసం పాడిన సాంగ్ కారణం అని నాకు కూడా తెలీదని బయటకు వచ్చిన తరువాత స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఈ విషయం చెప్పారని చెప్పాడు. సీఎం జగన్ కోసం పాడిన పాట తన గెలుపుకు కారణమైందని అన్నాడు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభిమానుల నుండి కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావటం కొరకు సపోర్ట్ లభించినందుకు సంతోషంగా ఉందని రాహుల్ చెప్పాడు. బిగ్ బాస్ టైటిల్ విన్ అయిన తరువాత బయట ఎలా ఉన్నానో ఇంట్లో కూడా అలాగే ఉన్నానని ఎలాంటి మార్పులు లేవని రాహుల్ అన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: