తెలుగు మొట్టమొదటి హాస్య కార్యక్రమం మొదటి సారిగా ఈ టీవీ తలపెట్టింది అలాగే గత కొన్ని సంవత్సరాలుగా దీనికి పోటీలేకుండ నడుస్తూ వస్తున్న జబర్దస్త్ మరియు ఎక్సట్రా జబర్దస్త్ కార్యక్రమాలు రోజా మరియు నాగబాబు అతిధులుగా న్యాయ నిర్ణయితలుగా  వ్యవహరిస్తున్న  కార్యక్రమాలు అవి. అయితే గత కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న జబర్దస్త్ కమెడియన్లు శాంతి స్వరూప్, వినోద్‌లు  జబర్దస్త్ కార్యక్రమాల్లోముఖ్యంగా   ఆడ వేషాల‌తో  శాంతి స్వరూప్, వినోద్‌లు పాపుల‌ర్ అయిన వీరు ఈ కార్యక్రమం లో  అవకాశాలు పోగొట్టుకున్నారు.


ఎందుకు అలా అని ఆరా తీయగా  అప్ప‌ట్లో వాళ్లు జగన్ పాదయాత్రకు వెళ్లారు అని అందుకే అవకాశాలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ విషయం ఎంతవరకు నిజం అనుకుంటుండగానే ఒక ఇంటర్వ్యూ లో వారు ఎందుకు జబర్దస్త్‌కు దూరం కావాల్సి వచ్చిందో కారణం చెప్పారు. తనను జగన్ పాదయాత్ర  కి వెళ్ళాము కనుకనే పక్కన పెట్టారని లేదంటే మరో కారణాల కోసమే పక్కనబెట్టలేదని బాధను బయటపెట్టారు.

అలాగే జగన్ పాదయాత్ర లో ఉన్న మేము   ఇచ్చిన తేదీలకు  తామే సరిగ్గా వాడుకోలేదని అందుకే తనను జబర్దస్త్ నుంచి దూరం పెట్టేసారని చెప్పుకొచ్చాడు.   స్క్రిప్ట్ అంతా తాయారు  చేసుకొని  వారికున్న క్యారక్టర్ అనుకూలంగా  రాసుకున్నపుడు తాము వదిలేసి వెళ్లడంతో వాళ్లకు నచ్చలేదని  కోపం వచ్చిఉండవచ్చని దాంతో టీమ్ లీడ‌ర్స్ తమ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌లేక‌పోయార‌ని ఇబ్బందులు ప‌డ్డార‌ని గుర్తు చేసుకున్నారు అదికూడా  న్యాయమేనని చెప్పుకొచ్చారు.


దాంతో జ‌బ‌ర్ద‌స్త్ డైరెక్ష‌న్ టీం లో ఇంకెవ‌రూ ఇంకెప్పుడు  ఇలా చేయ‌కూడద‌ని తమపై నిషేధం విధించార‌ని గుర్తు చేసుకున్నారు.అలాగే మాపైనే న్యాయ నిర్ణయితలు రోజా మరియు నాగబాబు లకు   కూడా  మాపైన ఎలాంటి దురుద్దేశం గాని  కోపంకానీ లేదు అని ప్రకటించారు. అలాగే   త్వరలోనే తాను మళ్లీ జబర్దస్త్ షోకు రీ ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: