దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం " ఆర్ ఆర్ ఆర్". బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయం ఇంతవరకు తెలియలేదు. ఎన్టీఆర్ కి జోడీగా ఇంగ్లీష్ భామని తీసుకునే యోచనలో ఉన్నారట.


ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జులై లో విడుదల చేస్తారన్న చెప్పిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో రాజమౌళి ఎన్టీఆర్,చరణ్ లను షూటింగ్ లో బిజీ చేశేశారు. భారీ చిత్రం కావడంతో నిర్మాణాంతర కార్యక్రమాలకే నెలల సమయం పడుతుంది. అందుకే జక్కన్న కనీసం వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.


కాగా ఆర్.ఆర్.ఆర్ మూవీలో ఉత్కంఠ రేపే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, అలరించే పాటలు కూడా ఉంటాయట. ఆర్.ఆర్.ఆర్ మూవీలో దాదాపు ఏడు పాటలకు పైనే ఉంటాయని సమాచారం. దేశభక్తిని రగిలించే ఉత్తేజపూరిత పాటలతో పాటు, చరణ్ అలియా భట్ ల మధ్య ఒకటి లేదా రెండు డ్యుయట్ సాంగ్స్ మరియు ఎన్టీఆర్ జోడీతో వచ్చే కొన్ని పాటలతో కలిపి మొత్తం ఏడు నుండి ఎనిమిది పాటలు ఉండే అవకాశం ఉందట. 


విప్లవ గీతాలు రాయడంలో ప్రముఖులయిన ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ గారు ఈ సినిమాలో మూడు పాటలు రాశారట. ఈ మూడు పాటలు ప్రముఖంగా దేశభక్తికి, స్వాతంత్ర్య కాంక్షను రగిలించేవిగా ఉంటాయని సమాచారం. మిగతా పాటలని ప్రముఖ గీత రచయితలచే రాయిస్తున్నారట. మొత్తానికి ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: