సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఎప్పుడూ తన సినిమాల రిలీజ్ డేట్స్ ని ముందే చెప్పే రామ్ గోపాల్ వర్మ ఈసారి మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్ల సినిమా రిలీజ్ డేట్ ని చాలా సీక్రెట్ గా ఉంచారు. కానీ నవంబర్ 28వ తేదీన రిలీజ్ చేసి అందరికి షాక్ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ విడుదలై చాలా చర్చలకు దారి తీసింది. ఈ సినిమా లో కే ఏ పాల్ పై తీసిన ఒక పాటను కూడా విడుదల చేసారు. విడుదలయిన వెంటనే ఆ పాట ఒక పెద్ద హిట్ కావడం గమనార్హం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో నటుడిగా కనిపించనున్నాడు. 


గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసి ఆసక్తిని రేపుతున్నాడు ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రీ రిలీజ్ ఈవెంట్.... ఇంకా కొన్ని సినిమా ప్రమోషన్ల తో ఈ సినిమా గురించి చాలా మంది ప్రజలకు తెలిసేలా చేయబోతున్నాడు. కులం పేరుతో విడుదలయ్యె ఈ సినిమాని ఆపడానికి చాలా మంది వేచి చూస్తున్నట్లు సమాచారం. 


సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. 2019 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత సంభవించిన సంఘటనల పై ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది. రామ్ గోపాల్ వర్మ చివరగా తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లాగా... కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా అన్ని అడ్డంకులు దాటుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేకపోతే విడుదలవకుండా ఆగిపోతుందా అనేది తెలియనున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: