తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేష్ కు ఉన్న క్రేజే వేరు.  ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు క్యూ క‌డుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మాత్రం వీట‌న్నిటికి కొంచం విరుద్ధ‌మైన కామెంట్స్ మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. అవేమిటంటే... 
 మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూస‌ర్లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. కొత్త‌గా ఉందే... విన‌డానికి చాలా ఆశ్చ‌ర్యంగా కూడా ఉంది అనుకుంటున్నారా. ఆయ‌న డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తారు. అలాంటిది ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే ఇలాంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇండస్ట్రీలో మహేష్ బాబుకు మంచి పేరుంది.. నిర్మాతల హీరో అనే ఇమేజ్ కూడా ఉంది. అయితే ఈయన తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం కాస్త కఠువుగానే ఉంటాడు.


దానికి కారణం కూడా అప్పట్లో తన తండ్రి అని కూడా చెప్పాడు సూపర్ స్టార్. అప్పట్లో తన తండ్రి మంచితనం చూసి చాలా మంది నిర్మాతలు డబ్బులివ్వలేదని.. అది చూసే తను ఇలా మారిపోయా నన్నాడు మహేష్.  సూప‌ర్‌స్టార్ కృష్ణ ఒకానొక స‌మ‌యంలో ఎవ‌రైన డ‌బ్బులు ఇచ్చుకోలేని ప‌రిస్థితి ఉంటే వాళ్ళ‌కు ఆయ‌న డ‌బ్బులు తీసుకోకుండానే నటించేవారంట‌. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం మహేష్ బాబు తనతో సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలకు కొన్ని కండీషన్లు పెడుతున్నాడని.. అది చూసి వాళ్లు కాస్త భయపడుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య దిల్ రాజుతో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నాడు సూపర్ స్టార్. సీతమ్మ వాకిట్లోతో మొదలైన వీళ్ల బంధం.. మహర్షి.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు వరకు కూడా కొనసాగుతూనే ఉంది.


వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులతో తాను చేయబోయే సినిమాలకు కూడా దిల్ రాజుతోనే కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాడు మహేష్ బాబు. కానీ దిల్ రాజు మాత్రం దీనికి సంసిద్ధంగా లేరని వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి కారణం మహేష్ బాబు పెడుతున్న కొన్ని కండీషన్స్ అనే ప్రచారం జరుగుతుంది. పైగా ఈయన రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్ అంటూ నిర్మాణ సంస్థ పెట్టాడు. తన పారితోషికం బదులుగా నిర్మాణంలో వాటా తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఇక‌పోతే చాలా మంది నిర్మాత‌లు ఆ కండీష‌న్‌కి  ఒప్పుకోవ‌డం క‌ష్ట‌మే. అందులోనూ దిల్‌రాజు లాంటి క్యాలుక్లేటెడ్ ప్రొడ్యూస‌ర్ అస‌లు ఒప్పుకోరు అని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: