ఆయన నటనకి ఫిదా అవ్వని వారంటూ ఎవ్వరు వుండరు గొప్ప నటుడిగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు .ఆయనని  సినీ రంగంలో లెజెండరీ నటుడు, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అనే పేరులతో పిలుస్తారు. అమితాబ్‌ బచ్చన్‌ దశాబ్దాల తరబడి సినీ ప్రియులను అలరిస్తూ 50 ఏళ్ల హిందీ సినీ పరిశ్రమలో  ప్రస్ధానాన్ని పూర్తిచేసుకున్నారు. అమితాబ్‌ మొట్టమొదటి సారి 1969లో సాథ్‌ హిందుస్తానీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన నటనతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించారు.

అమితాబ్‌ భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయన  నటనకు సినీ ప్రియులు నీరాజనాలు పలికారు. సుదీర్ఘ సినీ పయనంలో పలు బ్లాక్‌బస్టర్లు అందించిన అమితాబ్ తన నట ప్రస్ధానం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో అమితాబ్‌ ఎంట్రీ సీన్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందంటే అతిశయోక్తి కాదు.ఇటీవల తెలుగు చిత్రం  సైరా నరసింహారెడ్డి లో అమితాప్ మెగాస్టార్ తో కలిసి నటించారు ఈ చిత్రం లో అమితాబ్ గారి నటనకు అభిమానులు ఫిదా అయ్యిపోయారు .దింతో మరో సారి బ్లాక్ బాస్టర్ దక్కిన్చుకున్నారు .


బిగ్‌బీ తొలి మూవీ 1969 నవంబర్‌ 7న సాథ్‌ హిందుస్తానీ  విడుదలై 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఐదు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న అమితాబ్‌ తన నటవారసునిగా అభిషేక​ బచ్చన్‌ను పరిశ్రమకు అందించారు.ఆయన కుమారుడు అభిషేక్‌ అమితాబ్‌ 50 ఏళ్ల సినీ ప్రస్ధానం సందర్భంగా తన తండ్రి హీరోగా ఎదిగిన తొలినాళ్ల ఫోటోను పోస్ట్‌ చేశారు. కేవలం కుమారుడిగానే కాదు..నటుడిగా..ఓ అభిమానిగా మేమంతా మీ ఔన్నత్యానికి సాక్షులుగా నిలిచామని అభిషేక్‌ రాసుకొచ్చారు.

సినీ అభిమానులంతా తాము బచ్చన్‌ తరంలో జీవించామని గర్వంగా చెప్పుకుంటారని, 50 ఏళ్లు సినీ జీవితంలో కొనసాగినందుకు అభినందనలు తెలిపారు. మరో 50 ఏళ్ల కోసం తాము నిరీక్షిస్తామని అభిషేక్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: