తెలుగు సినిమాలు కలెక్షన్లలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. 80,90 దశకాల్లో తెలుగు సినిమా కలెక్షన్ల స్థాయిని దేశానికి తెలిసేలా చేసింది చిరంజీవి. అప్పట్లో ఓవర్సీస్ కలెక్షన్లు లేవు. 2000 తరువాత విదేశాల్లో కలెక్షన్లు వస్తున్నా నామమాత్రంగానే ఉండేవి. కానీ ఓవర్సీస్ లో తెలుగు సినిమా కలెక్షన్లకు బూస్ట్ ఇచ్చింది మహేశ్ బాబు సినిమాలే. దూకుడు సినిమాతో మిలియన్ మార్క్ సాధించి ఔరా అనిపించాడు.

 

 

అంతకుముందు రామ్ చరణ్ మగధీర చెప్పుకోదగ్గ కలెక్షన్లు సాధించినా దూకుడు మాత్రం మిలియన్ క్లబ్ లోకి చేరిన మొదటి చిత్రం మాత్రం దూకుడు. ఆ సినిమా విజయం గురించి అప్పట్లో లాస్ ఏంజిల్స్ పత్రిక కధనాలు ప్రచురించాయి. సినిమాలో మహేశ్ నటన, పాటలు, బ్రహ్మానందం, ఎమ్మెస్, ధర్మవరపు కామెడీ ట్రాక్, యాక్షన్ సీన్స్.. అన్నీ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అప్పటినుంచీ మహేశ్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వస్తున్నాయి. మహేశ్ ఫ్లాప్ సినిమాలు కూడా డీసెంట్ కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. దూకుడు కలెక్షన్లు విదేశాల్లో సత్తా చాటడంతో టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు అప్పటినుంచీ అటువైపు దృష్టి సారించారు. అక్కడి ప్రేక్షకుల అభిరుచి మేరకు కూడా కొన్ని సినిమాలు రూపొందయంటే కారణం దూకుడు ఇచ్చిన బూస్ట్ కారణం. కేవలం ఓవర్సీస్ కలెక్షన్లతో గట్టెక్కిన సినిమాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.

 

 

మహేశ్ బాబు నటించిన సినిమాల్లో ఇప్పటికి హయ్యస్ట్ ఓవర్సీస్ కలెక్షన్లు వచ్చిన సినిమా భరత్ అను నేను సినిమా. మహేశ్ కెరీర్లో అత్యధికంగా 3.4 మిలియన్లు వసూలు చేసి హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దీంతో మహేశ్ సినిమాలు తీసుకునే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎక్కువయ్యారు. మహేశ్ కు క్లాస్ ఆడియన్స్ లో అభిమానులు ఎక్కువ కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకుని కూడా సినిమాలు చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: