నితిన్ సినిమా వచ్చి చాలారోజులు అవుతుంది. పోయిన ఏడాది "శ్రీనివాస కళ్యాణం" తో వచ్చిన అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో చాలా గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు భీష్మగా వస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఛలో సినిమాతో తనలోని కామెడీని పరిచయం చేసిన వెంకీ ఈ సారి భీష్మ ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర పోస్టర్ లని రిలీజ్ చేసారు. 


తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. జస్ట్ 30 సెకన్లే ఉన్న ఈ ఫస్ట్ గ్లింప్స్ లో స్టొరీ ఏమీ రివీల్ చెయ్యలేదు కానీ ఒక రొమాంటిక్ సీన్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందమైన గులాబీ రంగు చీర కట్టుకుని  వయ్యారంగా రష్మిక నడుచుకుంటూ పోతుంటుంది.  వెనకాలే రష్మికని ఫాలో అవుతూ ఆమె నడుమును చూస్తూ ఉంటాడు.


నడుము కూడా విజయ్ మాల్యా లాంటిదిరా.. కన్పిస్తుంటది కానీ క్యాచ్ చెయ్యలేం' అంటూ రష్మిక నడుమును  వెరైటీగా విజయ్ మాల్యాతో పోల్చాడు!  అయితే నడుము సీన్ అనగానే తెలుగు ప్రేక్షకులకి ఖుషీ సినిమానే గుర్తొస్తుంది. అదీ గాక నితిన్ పవన్ కల్యాణ్ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఖుషీ సినిమాని గుర్తు చేయడానికే ఫస్ట్ గ్లింప్స్ లో నడుము చూపించారా అనే అనుమానం కలుగక మానదు.


ఏది ఏమైనా ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లుగ తెలుస్తుంది. వెంకీ కుడుముల తనకి అచ్చొచ్చిన జోనర్ అయిన రొమాంటిక్ ని కామెడీతో మిక్స్ చేసి తీసినట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోతో భీష్మ సినిమాపై అంచనాలు పెంచేశారు. అదీ గాక సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేసేంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేస్తారట. మరి ఈ సినిమా నితిన్ కి సక్సెస్ ని తీసుకొస్తుందా లేదా చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: