ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అక్కినేని తన అందచందాలతో...అద్భుతమైన నటనతో అందరి మనసులను ఇప్పటికీ దోచుకుపోతూనే ఉంది. తెలుగు హీరోయిన్ లలో సోషల్ మీడియాలో ఎక్కువ ఆక్టివ్ గా ఉండేది ఎవరు అంటే అది కేవలం సమంత అక్కినేనే. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ అందరి ధ్యాసను తనపై తిప్పుకుంటుంది ఈ నాగార్జున కోడలు.


ఈరోజు కూడా ఒక ఆసక్తికరమైన కామెంట్ ని చేసి అభిమానుల చర్చలకు దారితీసింది. ప్రస్తుతం ఓ తెలుగు హీరో తన రాబోయే సినిమా కోసం కండలు పెంచడానికి వ్యాయామశాలలో కసరత్తులు చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఒక ఫోటో ని ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ ఫోటో పై "ఓ మై గాడ్.. వాట్ ఈజ్ దిస్ క్రేజీనెస్", అంటూ కామెంట్ పెట్టి.. నవ్వుతూ ఉన్న ఎమోజీని పోస్ట్ చేసింది. 


హీరో మరెవరో కాదు.. చలో సినిమా హీరో నాగ శౌర్యా. ఓ బేబీ సినిమాలో నాగ శౌర్య సమంత కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓ బేబీ షూటింగ్ సమయంలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అందుకే తన స్నేహితుడైన నాగ శౌర్యా ఫిజిక్ పై కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇది చూసిన తమ అభిమానులు నెట్టింట గోల గోల చేస్తున్నారు. 


ఇక సినిమాల విషయానికొస్తే...సమంత 96 రీమేక్ సినిమాలో శర్వానంద్ కి జోడిగా నటిస్తున్నారు. 96 ఒరిజినల్ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష నటించారు. తమిళనాట పెద్ద విజయం సాధించిన ఈ రొమాంటిక్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. '96' ఒరిజినల్ డైరెక్టర్ అయినా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలవనున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: