'మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసి ఉండాలి' అంటూ అనుష్క మిర్చి సినిమా లో చెప్పిన డైలాగ్ గుర్తు ఉందా?,  ఈ డైలాగు ఒక్కటే కాదు అరుంధతి సినిమా లో జేజమ్మ అవతారం ఎత్తి, కమ్ముకున్న.. చీకట్లోనా... కమ్ముకొచ్చే వెలుతురమ్మా.. అంటూ మనల్ని అలరించారు. ఇక అనుష్క శెట్టి ఈ సూపర్ స్టార్ హీరోయిన్ స్థాయి చేరుకునే వరకు చాలానే కష్టపడ్డారు. 


అనుష్క అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. పూరీ జగన్నాథ్‌ ‘సూపర్‌’లో కథానాయిక కోసం చూస్తున్న రోజులవి. ఆ సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్‌ అనుష్క గురించి చెప్పారు. అప్పుడు పూరీ అనుష్కను సంప్రదించారు. అలా ఆమె హైదరాబాద్‌కు వచ్చి తొలి అవకాశం చేజిక్కించుకున్నారు. సినీ నేపథ్యం ఉన్న నటి కాకపోవడంతో అనుష్క తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు. పొట్టి దుస్తులు వేసుకుని కెమెరా ముందు నటించడం ఇబ్బందిగా భావించి అనేకసార్లు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమె తండ్రి ‘ఇష్టం లేకపోతే సినిమాల్లో నటించొద్దు.. ఎవరూ ఒత్తడి చేయడం లేదుగా?’ అని అన్నారట. ఆ మాటకు ఆమె వెనక్కి వెళ్లిపోలేదు. పట్టుదలతో సవాళ్లను ఎదుర్కొని, నిలదొక్కుకున్నారు. ఇప్పుడు స్టార్‌ నాయిక అయ్యారు.


అప్పటి వరకు గ్లామర్‌ పాత్రల్లో కనిపించిన స్వీటీ ఒక్కసారిగా జేజమ్మ అవతారం ఎత్తి, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అనుష్క ఆ సినిమాతో అభిమానుల మనసులో జేజమ్మ అయిపోయింది. అంతలా ఈ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అనుష్క. ‘వేదం’లో సరోజ పాత్రలో నటించి, అందరి మెప్పు పొందారు. సమాజంలో మహిళ పట్ల చూపిస్తున్న వివక్షపై గొంతెత్తిన సినిమా అది. ‘సైజ్‌ జీరో’ కోసం ఉన్నపళంగా బరువు పెరిగింది. ఈ చిత్రం కోసం అనుష్క దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: